Anee Master: స్టార్ మా నీకు తెలుసు.. ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌నంటూ అనీ మాస్ట‌ర్ ఫైర్

December 17, 2021 11:11 AM

Anee Master: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం రియాల్టీగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ షో వ‌ల్ల చాలా మంది కంటెస్టెంట్స్ ప‌లుమార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంట షో చూపించ‌డం వ‌ల‌న వారిపై నెగెటివిటీ రావ‌డంతో త‌ప్పుడు కామెంట్స్ పెడుతున్నారు. అయితే కేవలం కంటెస్టెంట్ లు మాత్రమే కాకుండా కొన్నిసార్లు వారి కుటుంబసభ్యుల గురించి కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఈ ట్రోలింగ్‏ను మాత్రం కొందరు సీరియస్ గా తీసుకుంటే.. మరికొందరు అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేదు.

Anee Master given warning that she did not leave anybody

అనూహ్యంగా బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌వితోపాటు ఆయ‌న భార్య, కూతురు మీద ట్రోల్ చేసే స‌రికి వారి పట్ల సీరియస్ అయ్యాడు రవి. తనపై.. తన కుటుంబంపై ట్రోలింగ్ చేసిన వారిని అస్సలు వదలిపెట్టను అంటూ హెచ్చరించాడు రవి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకుని మరీ ఆధారాలు.. స్క్రీన్ షాట్స్ దగ్గరుండి చూపించినట్టుగా కనిపిస్తోంది. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా అని అన్నాడు.

ఇక తాజాగా రవి తీసుకున్న నిర్ణయాన్ని బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అనీ మాస్టర్‌ అభినందించింది. అంతేకాదు నోటికొచ్చినట్లు మాట్లాడినా, చెడ్డ కామెంట్లు పెట్టినా తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. నేను ఎంత జెన్యూన్‌గా ఉన్నానో నీకు తెలుసు స్టార్‌ మా.. ఇక చేసింది చాలు అంటూ ఫైర్‌ అయింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందనేది మీకు తెలియదని, కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిదని వార్నింగ్‌ ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment