Ganguly : వ‌న్డే కెప్టెన్‌గా కోహ్లిని అందుకే త‌ప్పించాం.. అస‌లు కార‌ణం చెప్పిన బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ..

December 13, 2021 11:36 AM

Ganguly : భార‌త వ‌న్డే క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని త‌ప్పించి అత‌ని స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను బీసీసీఐ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే కోహ్లిని వ‌న్డే కెప్టెన్‌గా త‌ప్పించ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఫ్యాన్స్ మండిప‌డ్డారు. కాగా ఈ విష‌యంపై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ తాజాగా స్పందించారు.

bcci president sourav Ganguly  told why they removed virat kohli as odi captain

విరాట్ కోహ్లిని వ‌న్డే కెప్టెన్‌గా త‌ప్పించ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణాన్ని గంగూలీ వెల్ల‌డించారు. ఈ మేర‌కు గంగూలీ ఓ ఆంగ్ల మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. విరాట్ కోహ్లి 9 ఏళ్ల నుంచి 3 ఫార్మాట్ల క్రికెట్‌కు ఆడుతున్నాడు. 5 ఏళ్ల నుంచి కెప్టెన్‌గా ఉన్నాడు. అత‌నిపై ఎంతో ఒత్తిడి ఉంది.

టీ20ల‌కు కెప్టెన్‌గా కోహ్లి ఇప్ప‌టికే త‌ప్పుకున్నాడు. వ‌న్డేల‌కు కొన‌సాగుతాన‌ని చెప్పాడు. అయితే సెలెక్టర్లు మాత్రం తెల్ల బంతితో ఆడే క్రికెట్ ఫార్మాట్‌లు టీ20, వ‌న్డేల‌కు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుంద‌ని చెప్పారు. అందుక‌నే కోహ్లిని త‌ప్పించాల్సి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని అత‌నికి ముందే చెప్పాం. అత‌ను అర్థం చేసుకున్నాడు.. అని గంగూలీ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now