Mahesh Babu : బాబోయ్.. మ‌హేష్ అన్ని కోట్ల విలువైన ప్లాటు కొన్నాడా.. ధ‌ర తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

December 12, 2021 11:09 PM

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల‌లో మ‌హేష్ బాబు ఒక‌రు. ఆయ‌న సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం కొంత టైం కేటాయిస్తుంటారు. వారికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ని ఏర్పాటు చేయ‌డంలో ఏ మాత్రం త‌గ్గ‌రు. ఇప్ప‌టికే త‌న ఫ్యామిలీకి విలాస‌వంత‌మైన ఇల్లు కొనుగోలు చేసిన మ‌హేష్ బాబు తాజాగా హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేసి వార్త‌ల‌లోకి ఎక్కారు.

Mahesh Babu bought very expensive plot in jubileehills

నగరంలోనే రెసిడెన్షియల్‌ ఏరియాలకు సంబంధించి అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో ఇటీవల మహేశ్‌బాబు ప్లాటును కొన్నారు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్‌ వెబ్‌సైట్‌ మనీ కంట్రోల్‌ కథనం ప్రచురించింది. మహేష్ బాబు రూ.26 కోట్లు పెట్టి ప్లాటుని కొనుగోలు చేశారని.. స్థలం రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ వివరాలతో సహా ఒక ప్రముఖ బిజినెస్ ఆన్ లైన్ పత్రిక తెలియ‌జేసింది. 2021 నవంబరు 17న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగినట్లు తెలిపింది.

యర్రం విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌బాబు 1442 గజాల ప్లాటును 26 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. స్టాంప్‌డ్యూటీ కింద రూ.1.43 కోట్లు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించినట్లు పేర్కొంది. అయితే ఈ ఇంటి స్థలం కొనుగోలు విషయంపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకూ మహేష్ బాబు స్పందించలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌ర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment