నాకంటే నా కూతురే ఫేమస్.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!

May 7, 2021 9:19 PM

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వారి పిల్లలను ఇండస్ట్రీకి, అభిమానులకు పరిచయం చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు వారి పిల్లలను పరిచయం చేస్తూ ఉండడం మన చూసాము.సురేఖ వాణి తన కూతురు సుప్రీత కలిసి చేసే వీడియోలు ఫోటో షూట్లు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుని తన కూతుర్ని పరిచయం చేశారు.

తాజాగా నటి హేమ కూడా తన కూతురు ఇషాతో కలసి సందడి చేస్తూ పలు వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. తాజాగా హేమ తన కూతురుతో కలిసి మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్క్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చింత చెట్టును చూసి ఆగాలనిపించింది.ఇదే సమయంలో తాము చింతచిగురు కోస్తున్న దృశ్యాన్ని వీడియో తీస్తూనే కూతురుతో కలిసి అభిమానులతో లైవ్ చాట్ చేసింది హేమ. ఈ చింత చిగురుకు సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే లైవ్ సెషన్ లోనే హేమను ఓ హాట్ అంటూ కామెంట్ చేయడంతో హేమ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.హాట్ ఏంట్రా నాయనా నన్ను చూస్తే పిచ్చాదానిలా ఉన్నా, ఎవరైనా చూస్తె చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా… అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .తెలుగు, తమిళ, హిందీ, భాషలలో కలిపి సుమారు 200 సినిమాలకు పైగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now