మే 7, శుక్ర‌వారం, 2021 రాశి ఫ‌లాలు

May 7, 2021 1:31 PM

మే 7 (శుక్ర‌వారం), 2021న‌ మీ రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

may 7th friday 2021 daily horoscope

మేషం – ఈ రోజు ఈ రాశి వారు త‌మ శ‌త్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారు చాలా దృఢంగా ఉండేందుకు అవ‌కాశం ఉంది. సున్నిత‌మైన విష‌యాల‌ను చ‌ర్చించ‌క‌పోవ‌డ‌మే మంచిది.

వృష‌భం – రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆశిస్తున్న వారు ఈ రోజు త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు అవ‌కాశం ఉంది. త‌మ భ‌విష్య‌త్తు కోసం వారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హరిస్తారు.

మిథునం – ఈ రాశి వారు ఈ రోజు చాలా గొప్ప కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌క్తివంతుల‌తో, కొత్త వారితో గొప్ప అనుబంధాల‌ను పెంచుకుంటారు.

క‌ర్కాట‌కం – ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో ఎలాంటి వాద‌న‌లు, వాగ్వివాదాలు చేయ‌రాదు. మాట‌లు అనే ముందు ఒక‌సారి ముందు, వెనుక ఆలోచించాలి. లేదంటే ఇబ్బందుల్లో ప‌డిపోతారు.

సింహం – వీరు ఈ రోజు ప్ర‌శాంతంగా ఉండాల‌ని కోరుకుంటారు. ధ్యానం, యోగా వంటి రిలాక్సేష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

క‌న్య – ఉద్యోగులు ఈ రోజు ప‌ని మీద‌, ఆఫీసు కార్య‌క‌లాపాల కోసం ఎక్కువ‌గా తిర‌గాల్సి వ‌స్తుంది. ఎక్క‌డికి వెళ్లినా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలి. జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి.

తుల – వీరు ఎవ‌రి నుంచి అయినా వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోలేరు. ఎవ‌రైనా ద‌గ్గ‌రి వారితో త‌మ స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చిస్తే మంచిది.

వృశ్చికం – జీవిత భాగ‌స్వాముల నుంచి వీరికి ఈ రోజు సంపూర్ణ మ‌ద్ద‌తు, స‌హ‌కారం ల‌భిస్తాయి. వ్యాపారంలోనూ భాగ‌స్వాముల నుంచి స‌హ‌కారం ఉంటుంది. వీరికి అన్ని విధాలుగా స‌పోర్ట్ ల‌భించి ఉత్సాహంగా ఉంటారు.

ధ‌నుస్సు – వీరు ఆఫీసు ప‌నుల్లో ఈ రోజు తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే అన్నింటినీ ప్ర‌ణాళిక ప్ర‌కారం చేస్తే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

మ‌క‌రం – గతంలో వీరు చేసిన శ్ర‌మ‌కు, ప‌డిన క‌ష్టాల‌కు ఈ రోజు ఫ‌లితం ల‌భిస్తుంది. సుదీర్ఘ‌కాలంగా ఉండే పేమెంట్లు క్లియ‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది.

కుంభం – త‌మ జీవిత భాగ‌స్వామి నుంచి వీరికి ఈ రోజు స‌ర్‌ప్రైజ్ అందుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. బ‌హుమ‌తుల‌ను ఇచ్చి పుచ్చుకుంటారు.

మీనం – ఈ రాశి వారు త‌మకు అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉండే స్నేహితుల‌తో కొన్ని ర‌హ‌స్యాల‌ను పంచుకుంటారు. ప్ర‌కృతిలో గ‌డుపుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now