Ram Charan Tej : రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబుతో మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..?

December 8, 2021 7:34 PM

Ram Charan Tej : రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దీంతో భారీ మల్టీస్టారర్ లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్టార్‌ హీరోల మల్టీ స్టారర్ మూవీలు ఎక్కువవుతాయని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Ram Charan Tej and mahesh babu to act in multi starrer movie

ఆర్ఆర్ఆర్ సినిమా మరిన్ని మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ కి స్పూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కాంబోతో మరో సినిమా తెరకెక్కుతందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్, మహేష్ బాబులతో కలిసి ఓ సినిమా తెరకెక్కుతుందోట.

గతంలో వంశీ పైడిపల్లితో కలిసి రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వంశీ పైడిపల్లి ఈ ఇద్దరు స్టార్స్ తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతుందనేది సినీ వర్గాల టాక్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం అనేది రూమర్స్ గా ఉన్నప్పటికీ.. మహేష్ బాబుకు మొదట్నుండి మల్టీస్టారర్ లు తెరకెక్కించడం అంటే ఇంట్రెస్ట్ గానే ఉంది.

అలాగే రామ్ చరణ్ కు, మహేష్ బాబుకు మధ్య మంచి బాండింగ్ ఉంది. కనుక వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదని అంటున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా వర్కవుట్ అయితే.. బాలీవుడ్ సినిమాల స్థాయిలా.. టాలీవుడ్ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటుంది.

ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కుంభకోణం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now