అఖండ మూవీలో న‌టించిన ఈ చిన్నారి తెలుసా ? బాల‌య్య ప‌క్క‌న న‌టించే చాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

December 7, 2021 9:24 PM

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అఖండ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టికే రూ.80 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి టాప్ మూవీగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం.

do you know this baby deshta acted in akhanda movie with balakrishna

అఖండ మూవీకి బాల‌య్య న‌ట‌న ఒక ప్ల‌స్ పాయింట్ అయితే థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇందులో థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇక ఈ మూవీలో అనేక పాత్ర‌లు ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ ఇందులో న‌టించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ప్ర‌త్యేకంగా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమాలో బేబీ దేష్ట చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె న‌ట‌న‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

దేష్టను బాల‌కృష్ణ ముద్దు చేస్తున్న ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ బాల‌య్య‌.. బేబీ దేష్ట గురించి చెప్పారు. ఆమె న‌ట‌న ప‌ట్ల ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక తాజాగా ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌గా.. అందులో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

దేష్ట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిర్మాత‌ల‌కు క‌నెక్ట్ అయింద‌ని, త‌రువాత బోయ‌పాటికి పరిచ‌యం అయింద‌ని దేష్ట త‌ల్లిదండ్రులు తెలిపారు. ఆమెకు డైలాగ్స్ ప‌ల‌క‌డం స‌రిగ్గా రాక‌పోయినా బోయ‌పాటి త‌మ పాప‌తో అద్భుతంగా న‌టింప‌జేయించార‌ని తెలిపారు. మొద‌టి సినిమాతోనే త‌మ కుమార్తెకు మంచి పేరు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బాల‌కృష్ణ దేష్ట‌తో చాలా ఫ్రెండ్లీగా ఉంటార‌ని, త‌మ‌ను ఆయ‌న బాగా చూసుకున్నార‌ని తెలిపారు.

బోయ‌పాటి త‌మ పాప‌కు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఈ సినిమాను అంద‌రూ చూసి త‌మ పాప న‌ట‌న ఎలా ఉందో చెప్పాల‌ని వారు కోరారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment