Bigg Boss 5 : బిగ్‌బాస్ హౌస్ నుంచి ప్రియాంక ఎలిమినేష‌న్‌..?

December 4, 2021 3:37 PM

Bigg Boss 5 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 ఎంతో ఉత్కంఠగా కొన‌సాగుతోంది. ఫైన‌ల్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు, ఎవ‌రు చివ‌రి వ‌ర‌కు నిలుస్తారోన‌ని.. అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజా ఎపిసోడ్‌లో సింగ‌ర్ శ్రీ‌రామ్ టికెట్ టు ఫినాలె గెలుచుకుని ఈ సీజ‌న్‌లో ఫినాలెలో నిలిచిన తొలి కంటెస్ట్‌గా మారాడు. ఈ క్ర‌మంలో 5 మంది ఫినాలెలో ఉండ‌నున్న నేప‌థ్యంలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారోన‌ని ఆస‌క్తిగా చూస్తున్నారు.

Bigg Boss 5 telugu priyanka eliminated from house

ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం బిగ్‌బాస్ ఇంటి నుంచి ప్రియాంక ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఆదివారం ఈమె ఎలిమినేష‌న్ ఎపిసోడ్ ప్ర‌సారం అవుతుంది. అయితే అంత‌క‌న్నా ఒక రోజు ముందుగానే షూటింగ్ జ‌రుగుతుంది క‌నుక లీకుల ద్వారా ఈసారి ప్రియాంక ఎలిమినేట్ అవుతుంద‌ని తెలిసింది.

గ‌త వారం యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్‌లో 7 మంది మిగిలారు. ఇక ప్రియాంక ఎలిమినేట్ అయితే 6 మంది ఉంటారు. ఈ వారం ప్రియాంక‌కు త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఎలిమినేష‌న్ ప‌క్కా అని స‌మాచారం అందుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment