దారుణం.. క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ‌స్తుందేమోన‌ని.. భార్య‌, పిల్ల‌ల‌ను హ‌త‌మార్చాడు..

December 4, 2021 12:47 PM

అత‌ను ఎంతో చ‌దువుకున్నాడు.. ఫోరెన్సిక్ ప్రొఫెస‌ర్‌గా కూడా ప‌నిచేస్తున్నాడు.. కానీ అత‌ని మ‌తిస్థిమితం స‌రిగ్గా లేదు. దీంతో అత‌ను క‌రోనా వ‌స్తుందేమోన‌న్న భ‌యంతో క‌ట్టుకున్న భార్య‌ను, క‌న్న పిల్ల‌ల‌ను అతి దారుణంగా చంపేశాడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

up professor kills wife and children in fear of corona omicron variant

కాన్‌పూర్‌లోని క‌ల్యాణ్‌పూర్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్య‌క్తి ఫోరెన్సిక్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే అత‌ను క‌రోనా కొత్త వేరియెంట్ వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డి భార్య గొంతుకు తీగ‌ను బిగించి ఊపిరాడ‌కుండా చేసి చంపేశాడు. త‌రువాత సుత్తితో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల‌ల‌పై బ‌లంగా మోది హ‌త్య చేశాడు. అనంత‌రం త‌న ఇంటి నుంచి పారిపోయాడు.

అలా అత‌ను పారిపోతూ త‌న సోద‌రుడికి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుంద‌ని, అది ప్ర‌పంచంలో ఎవ‌రినీ విడిచిపెట్ట‌ద‌ని, అంద‌రినీ చంపుతుంద‌ని, అందుక‌నే దాన్నుంచి అంద‌రికీ విముక్తి క‌ల్పిస్తున్నాన‌ని.. అత‌ను వాట్సాప్ మెసేజ్ చేశాడు. అది చ‌దివిని అత‌ని సోద‌రుడు వెంట‌నే ఆ ఇంటికి వెళ్లి జ‌రిగిన దారుణాన్ని చూశాడు.

అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా.. వారు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టంకు త‌ర‌లించారు. ఆ ప్రొఫెస‌ర్‌పై కేసు న‌మోదు చేసి అత‌ని కోసం గాలిస్తున్నారు. కాగా ఆ ప్రొఫెస‌ర్ గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని, అందుకు అత‌ను చికిత్స కూడా తీసుకుంటున్నాడ‌ని వెల్ల‌డైంది. గ‌తంలో ఒక‌సారి భార్య‌ను చంప‌బోయాడ‌ని కూడా తెలిపారు. అయితే ఈసారి నిజంగానే త‌న కుటుంబం మొత్తాన్ని హ‌త్య చేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now