Prabhas : ప్ర‌భాస్ ఆ విధంగా చేసినందుకు అనుష్క క‌న్నీటి ప‌ర్యంత‌మైంది..!

December 4, 2021 9:09 AM

Prabhas : బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో బాహుబ‌లి త‌రువాత ఆయ‌న అన్నీ పాన్ ఇండియా మూవీల్లోనే న‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత ప్ర‌భాస్ ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అయితే ప్ర‌భాస్‌కు చెందిన ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

వెండితెర‌పై ప్ర‌భాస్‌, అనుష్క శెట్టిల రొమాన్స్ ఎంత‌లా ఉంటుందో అంద‌రికీ తెలుసు. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమాల్లో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఆశ్చ‌ర్య‌పోయారు. దీంతో వీరి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని, ప్రేమించుకుంటున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటార‌ని.. పెద్ద ఎత్తున అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిని వారు ఖండించారు. తాము ఫ్రెండ్స్ మాత్ర‌మేనంటూ చెప్పుకొచ్చారు.

Prabhas done that anushka shetty got emotional and cried

అయితే ప్ర‌భాస్‌ను ఇటీవ‌ల ప్ర‌భాక‌ర్ అనే ఓ అభిమాని ముంబై వెళ్లి మరీ క‌లిశాడు. తాను ఎంతో కాలం నుంచి ప్ర‌భాస్‌ను క‌ల‌వాల‌నుకున్నాన‌ని, ఇప్పుడు ఆ క‌ల నెర‌వేరింద‌ని అత‌ను తెలిపాడు. అయితే ప్ర‌భాస్‌ను క‌లిసిన సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్ త‌న బిడ్డ‌కు పేరు పెట్టాల‌ని ప్ర‌భాస్‌ను కోరాడ‌ట‌. దీంతో ప్ర‌భాస్ ఆ పాప‌కు అనుష్క అని పేరు పెట్టాడ‌ట‌. ఆ విష‌యం తెలిసి అనుష్క తీవ్ర‌మైన భావోద్వేగానికి గురైంద‌ట‌. క‌న్నీటి ప‌ర్యంత‌మైంద‌ట‌.

దీన్ని బ‌ట్టి చూస్తే అనుష్క‌, ప్ర‌భాస్‌ల మ‌ధ్య బ‌ల‌మైన బంధం ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే వీరి మ‌ధ్య ప్రేమ ఉంది కానీ.. పెళ్లి చేసుకునేందుకు ఎవ‌రో అడ్డు వ‌స్తున్నార‌ని.. ఫ్యాన్స్ అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ వీరు ఎప్ప‌టిక‌ప్పుడు విషెస్ తెలుపుకుంటూనే మంచి ఫ్రెండ్స్‌గా అయితే కొన‌సాగుతున్నారు. ఏది ఏమైనా ప్ర‌భాస్, అనుష్క‌ల మ‌ధ్య గ‌ట్టి బంధం ఉంద‌ని మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది. ఇక ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment