Karthika Deepam : మళ్ళీ ట్విస్ట్.. శ్రావ్యలో మార్పు.. నేరస్తుడైన‌ డాక్టర్ బాబు..

December 3, 2021 8:51 AM

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో సౌందర్య దీపతో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. దీపతో నువ్వు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకుంటుంది. కార్తీక్ ను కూడా సరిగా చూసుకోలేదని అంతా ఆ మోనిత వల్లే జరిగిందని అనడంతో దీప ఓదార్చి ధైర్యం చెబుతుంది. మోనిత ఇంట్లో ప్రియమణి సామాన్లన్నీ చిందరవందరగా వేయడంతో మోనిత వచ్చి ఇలా ఎందుకు చేశావని అడుగుతుంది. ఇదంతా మీకోసమే చేశానని మీపై ఇంత జరిగినా కూడా ఎందుకు కోపం చూపించడం లేదని రెచ్చగొడుతుంది.

Karthika Deepam 03 december 2021 full episode

ఎలాగైనా కార్తీక్ ను నా సొంతం చేసుకుంటాను అంటూ.. దీప పని ఎలాగైనా చేస్తానని ప్రియమణికి మాట ఇస్తుంది. ఇక సౌందర్య కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే శ్రావ్య వచ్చి మాట్లాడుతుంది. సౌందర్య పట్టించుకోకుండా కార్తీక్ కోసం ఎదురు చూస్తుంది.

శ్రావ్య ఎంత మాట్లాడినా పట్టించుకోక పోయేసరికి ఎంతైనా పెద్ద కోడలు, పెద్ద కొడుకు, వాళ్ల పిల్లలు మాత్రమే కావాల‌ని, మమ్మల్ని పట్టించుకోదని అనుకోవడంతో మొత్తానికి శ్రావ్యలో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది.

కార్తీక్ హాస్పిటల్‌లో ఉండగా అక్కడికి ఓ పేషెంట్ తరపున అతడి భార్య, పిల్లలు వచ్చి కార్తీక్ తో ఎలాగైనా రక్షించమని కోరుకుంటారు. ఇక పిల్లలు కూడా మా నాన్నని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటారు. దాంతో కార్తీక్ వాళ్లకు ధైర్యం చెప్పి నేను చూసుకుంటాను అని మాట ఇస్తాడు.

ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ కు సిద్ధమవుతుండగా కార్తీక్ కు స్పృహ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. దాంతో అతని చేతులు వణుకుతూ ఉండగా డాక్టర్ రవి ఉండి బాగానే ఉన్నావు కదా కార్తీక్ అని ప్రశ్నిస్తాడు.

కానీ కార్తీక్ మాత్రం ఎలాగైనా అతడిని బతికించాల‌ని ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి మరణించడంతో డాక్టర్ రవి వెంటనే కార్తీక్ తో అతడిని చంపేశావు అంటాడు. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now