NTR : ఎన్‌టీఆర్ సీఎం అవుతారు, ఆయ‌న జాత‌కంలోనే ఉంది.. వేణు స్వామి మ‌ళ్లీ వ్యాఖ్య‌లు..

December 2, 2021 2:23 PM

NTR : ఈ మధ్యకాలంలో వేణుస్వామి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. గతంలో ఈయన సమంత, నాగచైతన్య గురించి చెప్పిన మాటలు నిజం అవడంతో ప్రస్తుతం ఇతను సినీ హీరోల జాతకం గురించి బయట పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2024 కి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉండదని, ఆయ‌న‌ రాజకీయాల్లో ఉండ‌ర‌ని వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

NTR will become CM says astrologer venu swamy

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న తారక్ కేవలం తన దృష్టిని సినిమాలపై మాత్రమే పెట్టారు. కానీ ఈయన రాజకీయాలలోకి రావాలని ఎంతోమంది అభిమానులు భావిస్తున్నారు. రాజకీయాలపై శ్రద్ధ చూపని ఎన్టీఆర్ గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్టీఆర్ జాతకం చూస్తే ఆయ‌న‌ జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం పుష్కలంగా ఉందని వేణు స్వామి తెలిపారు.

ఎన్టీఆర్ నక్షత్రం, జయలలిత నక్షత్రం ఒకటేనని.. ఈ నక్షత్రం ఉన్నవారు రాజకీయాలలో మంచి పేరు సంపాదించుకుంటారని ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తన దృష్టి మొత్తం సినిమాలపై ఉంచారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన RRR చిత్రం జనవరి 7న విడుదలకు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment