Karthika Deepam : కార్తీక్ కుటుంబాన్ని వదలని మోనిత.. మ‌రో ప్లాన్‌కు సిద్ధం..

December 2, 2021 10:20 AM

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో వేదికపై మోనిత కార్తీక్ తనను మోసం చేశాడని న్యాయం చేయమని అందరినీ కోరడంతో వెంటనే దీప పైకి వెళ్లి తనదైన స్టైల్లో మోనితకు గట్టి షాక్ ఇస్తుంది. తను మోసం చేసి, తప్పులు చేసి బాగా దిగజారిపోయింది.. అని దీప మోనిత గురించి అనటంతో మోనిత కోపంతో మండిపోయి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక బయటకు రాగానే ప్రియమణి ఇవన్నీ ఎందుకమ్మా.. అంటూ అనే సరికి తనపై అరుస్తుంది.

Karthika Deepam 02 december 2021 full episode

అప్పుడే దీప వాళ్లు బయటకు రావడంతో తన బాబుని అడ్డుపెట్టుకొని మీ డాడీ ప్రెసిడెంట్ అయ్యారురా.. అనేసరికి కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడే సౌందర్య వచ్చి ఆపుతుంది. ఇక దీప కూడా కోపంతో రగిలిపోతుంది. దీప వాళ్లు ఇంటికి వెళ్లగా ఆదిత్య వాళ్లను పలకరిస్తాడు. మోనిత వచ్చిందని తెలియడంతో కోపంతో రగిలిపోతాడు. అప్పుడే పిల్లలు రావటంతో వాళ్లపై అరుస్తాడు. వెంటనే దీప పిల్లలకు నచ్చజెప్పి అక్కడినుంచి తీసుకెళ్తుంది.

మరోవైపు మోనిత.. దీప మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే లాయర్ సురేష్ ఫోన్ చేసి తనకు గుడ్ న్యూస్ చెబుతాడు. చాలా వరకు పనులు పూర్తవుతున్నాయని అంటాడు లాయర్ సురేష్. దీంతో మోనిత బాగా మురిసిపోతుంది. ప్రియమణితో తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఇక సౌందర్య దీప దగ్గర కూర్చొని నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అంటూ ఇది అంతా నీ కోసమే చేశాను అంటూ మాట్లాడుతుంది.
ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఉంద‌ని అంటుంది.

ఒకవేళ కార్తీక్ నిజంగానే తప్పు చేసినట్లయితే వాడితో విడాకులు ఇప్పించే దానిని అనేసరికి దీప షాక్ అవుతుంది. కానీ కార్తీక్ అలాంటి వాడు కాదని అంతా మోనిత వల్లే జరిగిందని బాధపడుతుంది. మొత్తానికి మోనిత లాయర్ సురేష్ తో హైలెట్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now