Akhanda Movie Review : అఖండ మూవీ రివ్యూ.. బాల‌య్య ప్రేక్ష‌కుల‌కు మాస్ జాత‌ర‌..

December 2, 2021 9:49 AM

Akhanda Movie Review : నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఅఖండ సినిమా పెద్ద తెర‌పై ప్ర‌త్య‌క్షం అయింది. ప‌లు చోట్ల ప్రీమియ‌ర్స్, బెనిఫిట్స్ జ‌రుపుకున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వ‌చ్చిన‌ హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు సినిమా షూటింగ్ జరుగుతుండగానే బోయపాటి రిలీజ్ చేసిన మూవీ అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Akhanda Movie Review treat for nandamuri balakrishna fans

బాల‌కృష్ణ చిత్రంలో ఊరికి పెద్ద‌గా ఉండే ముర‌ళీ కృష్ణ పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న‌ ఎవరికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుంటారు. ఇక ఊరికి క‌లెక్ట‌ర్‌గా వ‌చ్చిన శ‌ర‌ణ్య పాత్ర‌లో ప్ర‌గ్యా జైస్వాల్ న‌టించింది. ఊరి కోసం, ప్రజల కోసం ముర‌ళీ కృష్ణ పడే తాపత్రయం, నిస్వార్థమైన మనసు చూసి ఆకర్షితురాలు అవుతుంది శ‌ర‌ణ్య‌. అలా ఇద్దరూ వివాహం చేసుకొని వైవాహిక జీవితం మొదలుపెడతారు.

అదే ఊరిలో వరదరాజులు (శ్రీకాంత్) అక్రమ మైనింగ్ జరుపుతూ ఉంటాడు. కాపర్ మైనింగ్స్ లో అకృత్యాలు సాగిస్తూ ఉంటాడు. ఆ మైనింగ్స్ వలన చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తెలుసుకున్న మురళీ కృష్ణ రంగంలోకి దిగుతాడు. దీంతో అత‌డిని జైలుకు పంపుతాడు వ‌ర‌ద‌రాజులు. ఈ నిస్సహాయ స్థితిలో బాలయ్య అఖండగా ఎంట్రీ ఇస్తాడు. అఖండ ఎవ‌రు, అత‌ను ఏం చేస్తాడ‌న్న‌ది సినిమా చూస్తే అర్ద‌మ‌వుతుంది.

భారీ యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి తెరకెక్కించిన ఫైట్ సీక్వెన్సులు అభిమానులతోపాటు ఫ్యాన్స్ కి ట్రీట్ గా నిలిచాయి. అఘోరా పాత్ర‌లో బాల‌య్య న‌ట విన్యాసం అద్భుతం. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. రాయలసీమ యాసలో బాలయ్య డైలాగ్స్ మరో ఆకర్షణ. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

విలన్ గా శ్రీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో మొదటిసారి మంచి పాత్ర దక్కించుకుంది. కథలో కీలమైన కలెక్టర్ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. సాంగ్స్ లో బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ కూడా అద్భుతం. థమన్ బీజీఎం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. సినిమాలో కామెడీకి ఆస్కారం లేదు.

ఇది బాలయ్య వన్ మ్యాన్ షో అంటున్నారు. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. బాల‌య్య అభిమానుల‌కి ఇది పండ‌గలా అనిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now