Tamannah : ఆ విషయంలో తమన్నాకు భారీ షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. అసలేం జరిగిందంటే ?

December 1, 2021 3:51 PM

Tamannah : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తి చేసుకుని తరువాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగులతో బిజీగా మారారు. మెగాస్టార్, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంక‌ర్‌ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

Tamannah : ఆ విషయంలో తమన్నాకు భారీ షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. అసలేం జరిగిందంటే ?

ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనుల‌ను జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న తమన్నాకు చిత్రబృందం కోటిన్నర రూపాయలను రెమ్యూనరేషన్ గా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో చిరు చెల్లెలి పాత్రలో నటిస్తున్న కీర్తిసురేష్ కు ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు సమాచారం.

మిల్కీ బ్యూటీగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాత‌లు సంపాదించుకున్న హీరోయిన్ పాత్రలో నటిస్తున్న తమన్నాకు కీర్తి సురేష్ కన్నా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే తమన్నా రెమ్యూనరేషన్ విషయంలో అన్యాయం జరిగింది.. అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now