India Corona : ల‌క్ష దిగువ‌కు చేరుకున్న క‌రోనా యాక్టివ్ కేసులు.. కానీ..?

December 1, 2021 10:10 AM

India Corona : క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం దేశంలో రోజు రోజుకీ త‌గ్గుతోంది. దీంతో కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల‌తోపాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1 ల‌క్ష దిగువ‌కు చేరుకుంది. ఈ వివ‌రాల‌ను కేంద్ర ఆరోగ్య శాఖ బుధ‌వారం వెల్ల‌డించింది. అయితే క‌రోనా రెండో వేవ్ ప్ర‌భావం త‌గ్గుతున్న‌ప్ప‌టికీ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. మళ్లీ కోవిడ్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసే దిశ‌గా రాష్ట్రాలు ఆలోచ‌న చేస్తున్నాయి.

India Corona : ల‌క్ష దిగువ‌కు చేరుకున్న క‌రోనా యాక్టివ్ కేసులు.. కానీ..?

ఇక మంగ‌ళ‌వారం దేశ‌వ్యాప్తంగా 11,08,467 మందికి కోవిడ్ ప‌రీక్ష‌లు చేయగా 8,954 మందికి వైర‌స్ ఉన్న‌ట్లు నిర్దార‌ణ అయింది. 10,207 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు దిగువ‌గా.. 99,023 వ‌ద్ద ఉంది.

దేశ‌వ్యాప్తంగా 3.45 కోట్ల మందికి క‌రోనా సోకింది. అందులో 3.40 కోట్ల మంది కోలుకున్నారు. రిక‌వ‌రీ రేటు 98.36 శాతంగా ఉంది. గ‌తేడాది మార్చి నుంచి ఇదే అత్య‌ధికం కావ‌డం విశేషం. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 267 మంది కోవిడ్‌తో చ‌నిపోయారు. కేర‌ళ‌లో 177 మంది చ‌నిపోగా, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,69,247కు చేరుకుంది. మంగ‌ళ‌వారం 80,98,716 మంది టీకా వేయించుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 124 కోట్ల‌కు పైగా డోసుల‌ను పంపిణీ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now