Bigg Boss 5 : ప్రియాంక‌ – మాన‌స్ మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది.. హ‌గ్‌తో ఇష్యూ సాల్వ్ అయిందా ?

December 1, 2021 8:37 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో సీజ‌న్ 13 నామినేష‌న్స్ ఆస‌క్తిక‌రంగా సాగింది. స‌న్నీ, ష‌ణ్ముఖ్ త‌ప్ప ఈ వారం అంద‌రూ నామినేష‌న్‌ లలో ఉన్నారు. అయితే ప్రియాంక‌కి స‌పోర్ట్‌గా ఉన్న కాజ‌ల్‌ని ఆమె నామినేట్ చేయ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు మాన‌స్‌. కాజ‌ల్‌ని నువ్వు నామినేట్ చేయ‌డం క‌రెక్ట్ అనుకుంటున్నావా అని మాన‌స్ ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందించిన ప్రియాంక నాకు వేరే ఆప్ష‌న్ లేదని చెబుతుంది.

Bigg Boss 5 : ప్రియాంక‌ - మాన‌స్ మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది.. హ‌గ్‌తో ఇష్యూ సాల్వ్ అయిందా ?

మరి నువ్ నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు అని మానస్‌ని అడుగుతుంది ప్రియాంక. నేను నిన్ను ఫ్రెండ్ అని అనుకుంటున్నా కాబట్టి నిన్ను నామినేట్ చేయలేదు.. నువ్ కాజల్‌ని ఫ్రెండ్ అని అనుకోలేదు కాబట్టే నామినేట్ చేశావ్ అని అంటాడు. దీంతో ప్రియాంక.. నువ్ ఆమె వైపు నుంచే ఆలోచిస్తున్నావ్ తప్ప నా వైపు నుంచి ఎందుకు ఆలోచించవు.. నీ ఫ్రెండ్‌ని చేశానని కానీ నువ్ ఫీల్ అవుతున్నావా ? అని అంటుంది ప్రియాంక.

ప్రియాంక‌ – మాన‌స్ మ‌ధ్య నామినేష‌న్ గురించి సీరియ‌స్ డిస్క‌ష‌న్ న‌డుస్తున్న స‌మ‌యంలో మాన‌స్ అక్క‌డి నుండి వెళ్లిపోయాడు. ఈ విష‌యంలో ప్రియాంక మండిప‌డుతుంది. నీది మాట్లాడటం అయిపోతే వెళ్లిపోతావా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ కాసేపటికే మళ్లీ మానస్‌ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పింది. అయితే అతడు మాత్రం నేనిప్పుడు మాట్లాడలేనన్నాడు.

ఎవడో కోన్‌కిస్కా గొట్టం గాడు ఇలా అంటే పట్టించుకోను కానీ నువ్వంటే మాత్రం బాధపడతానని గట్టిగా అరిచేసింది పింకీ. ఎందుకు బాధపడతావని మానస్‌ అడగ్గానే ఒళ్లు కొవ్వెక్కి అంటూ ఏడ్చేసింది. నువ్వు నన్ను తప్పుగా ఫ్రూవ్‌ చేయాలని చూస్తున్నావంటూ మానస్‌ అనడంతో షాకైన పింకీ.. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అని తేల్చి చెప్పింది. రాత్రంతా మానస్‌ – ప్రియాంక మధ్య ఈ గొడవ జరుగుతుంటే కాజల్‌ ఎంట్రీతో ఇది మరింత పెద్దదిగా మారింది.

మాన‌స్‌తో గొడ‌వ‌పై క్లారిటీ తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా, కాజ‌ల్ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. దీంతో పింకీ.. కాజ‌ల్‌పై నోరు పారేసుకుంది. కట్‌ చేస్తే పింకీ ఇంకా భోజనం చేయలేదని తెలిసిన మానస్.. ఆమెను తినమని బతిమాలాడు. తన కోపం, ఆవేశం, ఆవేదన అంతా కలిసి దుఃఖంగా ఉప్పొంగుకురాగా అతడిని హగ్‌ చేసుకుని ఏడ్చేసింది. దీంతో మానస్‌ ఆమెను ఓదార్చాడు.

కాజ‌ల్ భ‌లే క‌న్నింగ్ గేమ్ ఆడుతుంద‌ని సిరి, ష‌ణ్ముఖ్‌లు ముచ్చ‌టించుకున్నారు. సన్నీ ఫ్యాన్స్‌ తనకు ఓట్లేస్తారనే కాజల్‌ అతడితో సన్నిహితంగా ఉందన్నాడు షణ్ను. ఇంతలో షణ్ను కెప్టెన్సీ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్‌. అనంతరం బిగ్‌బాస్‌ ప్రతిష్టాత్మకమైన “టికెట్‌ టు ఫినాలే” టాస్క్‌ ప్రవేశపెట్టాడు. ఇందులో మొదటి లెవల్‌ ‘ఎండ్యురెన్స్‌ టాస్క్‌’లో భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్‌ టబ్‌లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే ఆ సమయంలో ఇతరులు వారి టబ్‌లోని బాల్స్‌ తీసుకోవచ్చని తెలిపాడు.

ఆట మొదలవగానే అందరూ ఐస్‌ వాటర్‌లో నిలబడ్డారు. కానీ సన్నీకి చెరోవైపు కాజల్‌, మానస్‌, షణ్ను పక్కన సిరి ఉండటంతో వారి బాల్స్‌ దొంగిలించడానికి కూడా ప్రయత్నించడం లేదు. త‌ర్వాత స్థానాలు మార్చుకోమ‌ని బిగ్ బాస్ చెప్పారు. ఈ రోజు అస‌లు ఆట మొద‌లు కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now