Samantha : చైతన్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భయపడుతున్న సమంత..?

December 1, 2021 9:58 AM

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్, బ్యూటిఫుల్ కపుల్‌ గా పేరు సంపాదించుకున్న సమంత, నాగచైతన్య 4 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. ఎంతో సంతోషంగా ఉందనుకున్న వీరి జీవితంలో  మనస్పర్ధలు రావడం ద్వారా విడాకుల ప్రకటన చేశారు. ఇలా నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన చేసిన అనంతరం వారి కెరీర్ పై పూర్తి దృష్టిని సారించి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Samantha : చైతన్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భయపడుతున్న సమంత..?

ఈ క్రమంలోనే సమంత టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అనే వ్యత్యాసం లేకుండా అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే ఈమె తమిళంలో ఒక సినిమాలో నటించగా తెలుగులో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ ఎంట్రీకి కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈమె హాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరేంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌ పేరుతో ఫిలిప్ జాన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా సమంత ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఏం మాయ చేశావె సినిమా కోసం ఆడిషన్స్ కి వెళ్లానని, అప్పటి నుంచి ఏ సినిమా ఆడిషన్స్ కి వెళ్ళలేదని అయితే ఈ హాలీవుడ్ సినిమా ఆడిషన్స్ లో పాల్గొనాలని తెలియడంతో తాను ఎంతో భయపడ్డానని తెలిపింది. ఏం మాయ చేశావె సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ప్రస్తుతం అదే ఫీలింగ్ ఉందని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని భయపడుతున్నానని.. ఆమె తెలియజేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now