Evaru Meelo Koteeshwarulu : మ‌హేష్ – ఎన్టీఆర్ షో కి టైం ఫిక్స్.. ఇక రికార్డులు చెరిగిపోవాల్సిందే..!

November 30, 2021 4:24 PM

Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటు సినిమాలతోపాటు ఇటు బుల్లితెరపై కూడా స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. బిగ్‏బాస్‌‌షోతో బుల్లితెరపై కూడా కింగ్ అనిపించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో ర‌చ్చ చేస్తున్నాడు. టాప్ టీఆర్ఫీతో ఈ షో దూసుకుపోతోంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వచ్చింది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. తాజాగా తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ అలరిస్తున్నారు.

Evaru Meelo Koteeshwarulu : మ‌హేష్ - ఎన్టీఆర్ షో కి టైం ఫిక్స్.. ఇక రికార్డులు చెరిగిపోవాల్సిందే..!

ఈ షోకి సామాన్యులతోపాటు సెల‌బ్స్ కూడా హాజ‌ర‌వుతున్నారు. మొదటి గెస్ట్‌గా తారక్ మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంకు వచ్చి సందడి చేశారు. ఆ తర్వాత బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత, మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్  – దేవిశ్రీ ప్రసాద్‌ హాజరయ్యారు. ఇక మ‌హేష్ కూడా హాజ‌రు కాబోతున్న‌ట్టు ఎప్ప‌టి నుండో ప్రచారం అవుతోంది.

డిసెంబ‌ర్ 4న రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు షో ప్ర‌సారం కానుంది. గంట‌న్న‌ర పాటు సాగ‌నున్న ఎపిసోడ్ లో మ‌హేష్ ఎన్టీఆర్‌ అభిమానులకు కావ‌ల‌సినంత వినోదాన్ని పంచ‌నున్నారు. చివరిగా మహేష్, ఎన్టీఆర్ ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిశారు. ఈ వేడుకలో మహేష్-ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఎన్టీఆర్.. మహేష్ ని అన్న అని సంబోధిచడం, మహేష్.. ఎన్టీఆర్ ని తమ్ముడు అనడం.. ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పించింది. మరి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో, ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now