Naga Chaitanya : నాగచైతన్య తన కెరీర్లో మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో తెలుసా.. వీటిని కనుక చేసి ఉంటే ?

November 30, 2021 9:59 PM

Naga Chaitanya : అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి జోష్ సినిమా ద్వారా పరిచయమైన నటుడు నాగచైతన్య. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతను ఆ తర్వాత ఏం మాయ చేశావె సినిమా ద్వారా మరొక అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇలా నాగచైతన్య కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాలలో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఆయన కెరీర్‌ లో పలు సినిమాలను వదులుకున్నారు. అయితే వాటిలో కొన్ని విజయవంతం కాగా మరికొన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలు ఉన్నాయి. మరి నాగ చైతన్య వదులుకున్న ఆ సినిమాలు ఏమిటి అనే విషయానికి వస్తే..

Naga Chaitanya : నాగచైతన్య తన కెరీర్లో మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో తెలుసా.. వీటిని కనుక చేసి ఉంటే ?

ఢమరుకం : నాగార్జున నటించిన ఢమరుకం సినిమా ముందుగా నాగచైతన్య దగ్గరికి వెళ్తే ఆ పాత్రలో తన కన్న తన తండ్రి సరిపోతారని నాగచైతన్య సలహా ఇచ్చారట. దీంతో అందులో నాగార్జున నటించారు. అయితే ఈ మూవీ ఫ్లాప్‌ అయింది.

కొత్త బంగారులోకం : ఈ సినిమా ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. అయితే మొదటగా ఈ సినిమా చేయాల్సింది నాగచైతన్యనేనట. ఈ సినిమాతోనే తన ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి నాగచైతన్య తప్పుకోవాల్సి వచ్చింది. ఇందులో గనక చైతూ నటించి ఉంటే ఎంతో పాపులర్‌ అయి ఉండేవాడు.

అన్నీ మంచి శకునములే : ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి ముందుగా ఈ కథతో నాగచైతన్య దగ్గరికి వెళ్లారు. అయితే ఆ కథ నచ్చలేదు. దీంతో నాగచైతన్య నో చెప్పాడు.

రిపబ్లిక్ : దేవా కట్ట ముందుగా ఈ సినిమా కథను నాగచైతన్యకు చెప్పాడట. ఈ సినిమాలో నటించడానికి చైతూ నో చెప్పడంతో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

Naga Chaitanya : నాగచైతన్య తన కెరీర్లో మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో తెలుసా.. వీటిని కనుక చేసి ఉంటే ?

గౌరవం : అల్లు శిరీష్ నటించిన ఈ సినిమా ముందుగా నాగచైతన్య వద్దకు వెళ్ళింది. అయితే ఈ సినిమాలో నటించడానికి నాగచైతన్య నో చెప్పడంతో ఇందులో శిరీష్ నటించాడు. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

భలే భలే మగాడివోయ్ : బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం నాగచైతన్యకు వచ్చింది. అయితే నాగ చైతన్య బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకి నో చెప్పాడు. ఇందులో గనక చేసి ఉంటే చైతూకు ఇంకో హిట్‌ వచ్చి ఉండేది.

అ ఆ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాను నాగచైతన్య చేయాల్సి ఉండగా అతను నో చెప్పడంతో నితిన్ వద్దకు వెళ్ళింది.

ఇలా తన కెరీర్లో నాగచైతన్య పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నాడని చెప్పవచ్చు. ఇవే కాకుండా మహాసముద్రం, సమ్మోహనం, వరుడు కావలెను వంటి చిత్రాలను కూడా నాగచైతన్య పలు కారణాల వల్ల వదులుకున్నాడు. వీటిల్లో సమ్మోహనం చిత్ర హిట్‌ అయింది. అయితే అన్ని చిత్రాలను అందరు హీరోలు చేయలేరు. కానీ కొన్ని సార్లు మంచి కథ ఉన్న సినిమాలో నటించాలన్నా.. అది హిట్‌ కావాలన్నా.. అంతా రాసి పెట్టి ఉండాలి. అయినప్పటికీ చైతూ మాత్రం తన ఖాతాలో పలు హిట్‌ చిత్రాలను వేసుకుని సక్సెస్‌ఫుల్‌గానే ముందుకు వెళ్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now