Nagababu : శ్రీముఖి పాట‌కు స్పృహ కోల్పోయిన నాగబాబు..!

November 30, 2021 2:54 PM

Nagababu : కెరీర్ మొద‌ట్లో సినిమాలు చేసి ఆ త‌ర్వాత బుల్లితెర‌పై యాంక‌రింగ్ చేసే అవ‌కాశాన్ని అందింపుచ్చుకుంది అందాల శ్రీముఖి. ఇప్పుడు బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై త‌న హ‌వాని చూపిస్తోంది. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భోళా శంక‌ర్ చిత్రంలో కీలక పాత్ర‌లో న‌టించే అవ‌కాశాన్ని దక్కించుకుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తాజాగా త‌న ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.

Nagababu : శ్రీముఖి పాట‌కు స్పృహ కోల్పోయిన నాగబాబు..!

ఇందులో నాగాబాబు, శ్రీముఖి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ సాగింది. శ్రీముఖి నిన్ను ఎప్ప‌ట్నుంచో ఒక‌టి అడ‌గాల‌ని అనుకుంటున్నా అని నాగ‌బాబు అడ‌గ‌డంతో శ్రీముఖి.. అడ‌గండి బాబుగారు అని అంది. దీనికి నాగ‌బాబు.. నీ నోటి నుంచి చ‌క్క‌టి పాట వినాల‌నుంది. త‌ప్ప‌కుండా బాబుగారు .. రెడీయా! అని శ్రీముఖి.. ద‌ర్ ద‌ర్ బాద్ తుక్‌డే .. పాట పాడింది, ఇంకే ముంది. నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. బాబుగారు అని శ్రీముఖి లేపినా లేవ‌లేదు.

ఇది ఫ‌న్నీ వీడియోగా వీరు షూట్ చేయ‌గా, ఈ వీడియోకి శ్రీముఖి.. బాబు బంగారం.. కాన్సెప్ట్ అండ్ డైరెక్ష‌న్ కూడా స్వీట్ ప‌ర్స‌న్ నాగ‌బాబుగారిదే అంటూ క్యాప్ష‌న్ పోస్ట్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. కాగా, శ్రీముఖి ఇటీవల ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలోనూ శ్రీముఖి నటించింది.

https://www.instagram.com/reel/CW3Wvehpgn3/?utm_source=ig_embed&ig_rid=158a67a2-75a3-4e37-81b5-d8a9cfc19336

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now