Sreemukhi : శ్రీముఖికి ఇదివ‌ర‌కే పెళ్లైందా.. నోరెళ్లబెడుతున్న నెటిజ‌న్స్..!

November 30, 2021 10:53 AM

Sreemukhi : నిజామాబాద్ పిల్ల శ్రీముఖి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. శ్రీముఖి యాంకర్ అవడానికి ముందే సినిమాల్లోకి ప్రవేశించింది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంది.

Sreemukhi : శ్రీముఖికి ఇదివ‌ర‌కే పెళ్లైందా.. నోరెళ్లబెడుతున్న నెటిజ‌న్స్..!

ప‌టాస్‌తో యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంటుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని ఫన్నీ గేమ్‌ ఆడింది.

నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అని శ్రీముఖి అడ‌గ్గా.. మీకు ఇదివరకే పెళ్లయిందంటూ సమాధానం వచ్చింది. ఇది చూసి షాక్‌ అయిన శ్రీముఖి తొక్కా.. అంటూ రియాక్షన్‌ ఇచ్చింది. మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా శ్రీముఖికి దిమ్మ తిరిగే షాక్ త‌గిలింద‌ని అంటున్నారు.

ఈ అమ్మ‌డు గతంలో త‌న పెళ్లి గురించి స్పందిస్తూ 31 ఏళ్ల వ‌య‌స్సు తర్వాత ఆలోచిస్తాన‌ని అంది. డబ్బులు బాగా ఉండి.. అందంగా ఉండే వాడు తనకు వరుడిగా కావాలంటూ.. సమాధానం ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment