Posani Krishna Murali : పోసాని గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీలేఖ !

November 29, 2021 7:28 PM

Posani Krishna Murali : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పోసాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలకు రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు సంగీత దర్శకురాలిగా ఎం.ఎం.శ్రీలేఖ పనిచేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ.. పోసాని గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Posani Krishna Murali : పోసాని గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీలేఖ !

పోసాని దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించానని, ఆయనకి సంగీతం పట్ల మంచి అవగాహన ఉందని ఆమె తెలిపారు. అయితే పని విషయంలో ఆయన టైం అంటే టైం అని, ఈ రోజు ఒక పాట పూర్తి కావాలంటే తప్పనిసరిగా ఆ పాటను పూర్తి చేయాల్సిందేనని ఈమె వెల్లడించారు.

ఏ మాత్రం ఆలస్యం అయినా వెంటనే ఫోన్ చేస్తారని, ఫోన్ లిఫ్ట్ చేయడం ఆలస్యమైనా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఏంటి అంటూ కోప్పడతారని, ఆ కోపం తగ్గిన తర్వాత మళ్లీ ప్రేమగా రాజా.. అంటూ పలకరిస్తారని.. ఈ సందర్భంగా పోసాని గురించి శ్రీలేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now