Samantha : ఆహా అవార్డుకు ఎంపికైన సమంత.. బెస్ట్ నాన్ ఫిక్షన్ షోగా ఎంపిక..

November 29, 2021 8:46 PM

Samantha : ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సమంత ఒకరు. ఈమె నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు తెలుగు, తమిళ చిత్రాలతోపాటు బాలీవుడ్ సినిమాలకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని సమాచారం. ఇలా విడాకుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సమంత ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Samantha : ఆహా అవార్డుకు ఎంపికైన సమంత.. బెస్ట్ నాన్ ఫిక్షన్ షోగా ఎంపిక..

ఇదిలా ఉండగా సమంత గతంలో ఆహా యాప్ ద్వారా సామ్ జామ్ అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటించారు. ఇలా సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఆహా అవార్డుల ప్రదానోత్సవాలను ప్రారంభించారు. ఈ అవార్డులలో భాగంగా బెస్ట్ నాన్ ఫిక్షన్ షోగా సమంత టాక్ షో సామ్ జామ్ నిలవడంతో ఈమె ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డులలో సమంతతోపాటు హెబ్బా పటేల్, ప్రియదర్శి, అమలాపాల్ వంటి పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now