Bigg Boss 5 : శ్రీరామ్‌కి ద‌గ్గ‌రైతే ఎలిమినేట్ కావ‌ల్సిందేనా ?

November 29, 2021 2:57 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇప్ప‌టికే 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మ‌రో మూడు వారాల‌లో ముగియ‌నుంది. ఎవ‌రు విజేత‌, ఎవ‌రు టాప్ 5లో ఉంటార‌నే దానిపై లెక్క‌లు మొద‌ల‌య్యాయి. మ‌రోవైపు హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తున్న విష‌యాల‌ను గ‌మ‌నిస్తుంటే కొన్ని సెంటిమెంట్స్ కూడా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

Bigg Boss 5 : శ్రీరామ్‌కి ద‌గ్గ‌రైతే ఎలిమినేట్ కావ‌ల్సిందేనా ?

సింగ‌ర్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ చంద్ర త‌న ఆటతో, మాటలతో, పాటలతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ షోలో కొనసాగుతున్నాడు. అతనితో క్లోజ్‌గా ఉన్న వాళ్లంద‌రూ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. మొదట్లో హమీదాతో శ్రీరామ్‌ ఎక్కువ టైం స్పెండ్‌ చేసేవాడు. ఇద్ద‌రూ క‌లిసి తెగ సంద‌డి చేసేవారు. ఒక‌రిని వ‌దిలి మ‌రొక‌రు ఉండ‌లేమేమో అన్న‌ట్టుగా ఉండేవారు. హమీదాను ఐదో వారంలో ఎలిమినేట్‌ చేశారు.

అప్పటి నుంచి శ్రీరామ్‌ బాగా డల్‌ అయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకుంటూ విశ్వకు దగ్గరవగా అతడిని కూడా పంపించేశారు. ఆ తర్వాత అనీ మాస్టర్‌కు సపోర్ట్‌ చేస్తూ ఆమెకు ద‌గ్గ‌ర అవుతుండ‌గా, అనీ మాస్ట‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఇక ఇప్పుడు హౌజ్‌లో ర‌వితో క్లోజ్‌గా ఉంటూ వ‌స్తున్నాడు శ్రీరామ్. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రవికి ఇంటిసభ్యులెవరూ సపోర్ట్‌ చేయకపోయినా శ్రీరామ్‌ ఒక్కడే అతడికే ఓటేశాడు. దీన్ని బట్టి శ్రీరామ్‌కు రవి అంటే ఎంత అభిమానమో ఊహించవచ్చు. అలాంటిది రవి కూడా ఎలిమినేట్‌ అయిపోతే హౌస్‌లో శ్రీరామ్ ఒంట‌రిగా అయిపోయాడు. అతనితో క్లోజ్‌గా ఉన్న వాళ్లంద‌రూ ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారేంటి.. అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment