Sreenu Vaitla : శ్రీను వైట్ల తండ్రి ఇక లేరు.. బాధ‌లో కుటుంబ స‌భ్యులు..

November 28, 2021 11:16 AM

Sreenu Vaitla : ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన శ్రీను వైట్ల ఈ మ‌ధ్య కాలంలో చాలా డ‌ల్ అయ్యాడు. తాజాగా ఆయ‌న ఇంట్లో విషాదం నెల‌కొంది. శ్రీను వైట్ల తండ్రి ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల తండ్రి పేరు వైట్ల కృష్ణారావు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కృష్ణారావుకు శ్రీను వైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు.

Sreenu Vaitla : శ్రీను వైట్ల తండ్రి ఇక లేరు.. బాధ‌లో కుటుంబ స‌భ్యులు..
Sreenu Vaitla

వారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందుల పాలెం కాగా,  గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణారావు ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఈ వార్త విన్న శ్రీను వైట్ల ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడికి బయల్దేరింది. శ్రీను వైట్లకు పితృవియోగం అనే బాధాకరమైన వార్త విన్న సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు.

శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 2011లో దూకుడు, 2013లో బాద్‌షా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం పలకరించలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now