పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనండి.. అస్సాం, బెంగాల్ వాసుల‌కు మోదీ పిలుపు..

October 28, 2022 9:40 PM

అస్సాం, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొద‌టి ద‌శ పోలింగ్ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. శ‌నివారం పోలింగ్ ప్రారంభం కాగా మోదీ ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని, భారీ స్థాయిలో ఓట్లు వేయాల‌ని కోరారు. ఈ మేర‌కు మోదీ వేర్వేరుగా ట్వీట్లు చేశారు.

pm modi urged people to cast their votes in first phase of assam and bengal elections

అస్సాంలో మొద‌టి ద‌శ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌లంతా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ఓట్లు వేయండి. యువత ఓటు వేసేందుకు ముందుకు రావాల‌ని మోదీ అన్నారు. అలాగే ప‌శ్చిమ బెంగాల్‌లోనూ మొద‌టి ద‌శ ఎన్నిక‌లు జరుగుతున్నాయ‌ని, ప్ర‌జలంద‌రూ ఓటింగ్‌లో పాల్గొనాల‌ని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జ‌ర‌పాల‌ని అన్నారు.

అస్సాంలో మొత్తం 3 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా అక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న అధికారాన్ని నిలుపుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా గెల‌వాల‌ని, అక్క‌డ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇక బెంగాల్ లో మొత్తం 8 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే మోదీ ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఓట్లు భారీగా వేయాల‌ని పిలుపునిచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now