రిసార్టులో ఉంటూ రూ.3.20 ల‌క్ష‌ల బిల్లు ఎగ్గొట్టి పారిపోయాడు..!

November 26, 2021 2:45 PM

ఏపీకి చెందిన ఓ వ్యాపార‌వేత్త బెంగ‌ళూరులోని ఓ విలాస‌వంత‌మైన రిసార్ట్‌లో ఉంటూ కొన్ని రోజుల త‌రువాత బిల్లు చెల్లించ‌కుండానే ఎగ్గొట్టి పారిపోయాడు. మొత్తం రూ.3.20 ల‌క్ష‌ల బిల్లును అత‌ను చెల్లించ‌కుండానే వెళ్లిపోయాడ‌ని రిసార్ట్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

man flee without paying resort bill of rs 3.20 lakhs in bengaluru

ఏపీలోని పుట్ట‌ప‌ర్తికి చెందిన కే రాజేష్ అనే వ్య‌క్తి బెంగ‌ళూరు రూర‌ల్ జిల్లాలో ఉన్న దేవ‌న‌హ‌ల్లిలోని ఓ విలాస‌వంత‌మైన రిసార్ట్‌కు త‌ర‌చూ వ‌స్తుంటాడు. అత‌ను రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్‌. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట నెల‌ల త‌ర‌బ‌డి రిసార్టులోనే ఉంటుంటాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను గ‌త జూలై 23న రిసార్టుకు వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి అక్క‌డే ఓ సింగిల్ రూమ్ తీసుకుని ఉంటున్నాడు.

ఒక్క రోజు రూమ్ చార్జిలు రూ.7,850 కాగా అత‌ను మొన్నీ మ‌ధ్యే న‌వంబ‌ర్ 2వ వారం వ‌ర‌కు ఉన్నాడు. అయితే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు బిల్లుల‌ను స‌రిగ్గానే చెల్లించాడు. రూ.8 ల‌క్ష‌ల‌ను చెల్లించాడు. అనంత‌రం తాను ఇంకొన్ని రోజుల పాటు ఉంటాన‌ని చెప్ప‌డంతో న‌మ్మ‌క‌మైన రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌రే క‌దా అని చెప్పి రిసార్ట్ వారు కూడా అత‌న్ని అడ్వాన్స్ అడ‌గకుండానే రూమ్ రెంట్ గడువును పొడిగించారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే అత‌ను ఓ రోజు రిసార్ట్ నుంచి వెళ్లిపోయి ఇంక తిరిగి రాలేదు.

అత‌ను కొన్నిసార్లు లాంగ్ డ్రైవ్ వెళ్లి వ‌స్తుంటాడు. క‌నుక 1, 2 రోజుల పాటు వారు అత‌ని గురించి ప‌ట్టించుకోరు. కానీ ఈసారి వెళ్లి మ‌ళ్లీ రిసార్ట్‌కు రాలేదు. చూస్తే ఖాళీ చేసిన‌ట్లు అర్థ‌మైంది. దీంతో అత‌ను రూ.3.20 ల‌క్ష‌ల బిల్లు చెల్లించ‌కుండానే పారిపోయాడ‌ని రిసార్ట్ వారు గ్ర‌హించారు. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. వారు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now