Chatrapathi : సాధారణంగా ఎన్నో సినిమాలలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఉన్నవారు వారి చదువుల అనంతరం తిరిగి హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అదేవిధంగా మరికొందరు వారికి ఇష్టమైన వృత్తిలో స్థిరపడిపోయారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఛత్రపతి సూరీడు ఒకరు.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఛత్రపతి సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను ఎంతో హైలెట్ చేసే విధంగా సూరీడు పాత్ర ఉంటుంది. ఇందులో సూరీడు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు భశ్వంత్ వంశీ. ఆ సినిమాలో ఆ పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్ళినప్పుడు సుమారుగా 100 మంది ఉండగా కేవలం మొదటి రౌండ్లోనే రాజమౌళి భశ్వంత్ వంశీని సెలెక్ట్ చేసి ఈ పాత్రకు వందశాతం న్యాయం చేయగలడని భావించారట.
https://www.instagram.com/p/CBwGUviAXud/?utm_source=ig_embed&ig_rid=cdd43e70-ce26-4a08-b022-7313ce6717be
అయితే ఈ పాత్రలో భశ్వంత్ వంశీ జక్కన్న అంచనాలను మించి నటించడంతో ఇప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇక అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన భశ్వంత్ వంశీ ప్రస్తుతం ఎంతో పెద్దవాడిగా మారిపోయాడు. అతనిని చూస్తే గుర్తుపట్టలేనంతగా ఉన్న అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://www.instagram.com/p/B-7i4wjA5Gq/?utm_source=ig_embed&ig_rid=cb2a3779-e55e-4264-9e93-98491a4c6d6b