Bigg Boss 5 : సిరి చెంప ప‌గ‌ల‌గొట్టే వాడిన‌న్న జెస్సీ..!

November 26, 2021 8:23 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండ‌గా, అంద‌రి దృష్టి సిరి-ష‌ణ్ముఖ్‌ల‌పై ఉంది. ఈ ఇద్ద‌రు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తెగ రొమాన్స్ చేస్తున్నారు. అర్ధ‌రాత్రి వీరు చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ష‌ణ్ముఖ్‌కి ల‌వ‌ర్ ఉండ‌గా, సిరి అయితే త్వ‌ర‌లో శ్రీహాన్ ని పెళ్లి చేసుకోబోతోంది. ఈ సంద‌ర్భంలో వీరిద్ద‌రి ప్ర‌వ‌ర్త‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రీసెంట్‌గా సిరి త‌ల్లి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇద్ద‌రికీ గ‌ట్టిగానే ఇచ్చింది.

Bigg Boss 5 jessie said he might be slapped siri when he was there

బిగ్ బాస్ హౌస్‌లో సిరి-షణ్ముఖ్‌ల బరి తెగింపుపై విమర్శలు తలెత్తుతున్నాయి. హోస్ట్ నాగార్జున గ‌ట్టిగా మంద‌లించినా కూడా వారిలో మార్పు రాలేదు. సిరి తల్లి మాత్రం పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. షణ్ముఖ్‌-సిరిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారని, కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు.

అయితే మొన్నామ‌ధ్య సిరి తన త‌ల‌ను గోడ‌కేసి కొట్టుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే.. సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్‌ చేశాడు జ‌స్వంత్. ప్ర‌స్తుతం జ‌స్వంత్ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. వ‌ర్టిగో వ్యాధి వ‌ల‌న తెగ బాధ‌ప‌డ్డ జ‌స్వంత్ హౌజ్ నుండి ప‌దో కంటెస్టెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అత‌ను హెల్తీగా ఉన్నాడు. ఫంక్ష‌న్స్‌, వేడుకలు, పార్టీలు అంటూ తెగ ర‌చ్చ చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now