Karthika Deepam : పక్కా ప్రూఫ్‌ తో మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క.. చివరికి ఏం జరిగిందంటే?

November 25, 2021 11:15 AM

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక దీ..ప మోనితను అందరి ముందు గట్టిగా నిలదీస్తుంది. ల్యాబ్ లో దొంగతనంగా శాంపిల్స్ తీసుకుంది అనడంతో మోనిత టెన్షన్ పడుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ దీపక్క అంటూ ఈ తాళిబొట్టు నేనే కట్టుకున్నానని అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇది సహజ గర్భం అని మోనిత చెప్పడానికి ప్రయత్నించగా వెంటనే దీప.. మోనితకు జలక్ ఇచ్చింది.

Karthika Deepam 25 november 2021 full episode

తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ ను ప్రియమణితో తెప్పించి అందులో మోనిత శాంపిల్స్ తీసుకున్నట్లు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతారు. మోనిత ఇదంతా అబద్ధమని చెప్పగా ల్యాబ్ లో టెక్నీషియన్ తో మాట్లాడిన మోనిత నిజస్వరూపం వీడియోని చూపిస్తుంది. ఆ వీడియో చూడటంతో మోనిత షాక్ అవుతూ బారసాలకి వచ్చిన గెస్టు లందరినీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. మోనిత తన నిజస్వరూపం బయట పడ్డా కూడా మళ్లీ దీపకు వార్నింగ్ ఇస్తుండగా సౌందర్య వచ్చి ఆమె చెంప పగలగొడుతుంది.

మోనితకు వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి దీపను తీసుకొని వెళుతుంది. కార్తీక్ ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉండగా దీప వచ్చి కాసేపు మాట్లాడుతుంది. ఇక దీప ధైర్యాన్ని, గొప్పదనాన్ని పొగుడుతాడు కార్తీక్. ప్రియమణి ఇంట్లో ఉండగా ఓ లాయర్ వచ్చి మోనితను పిలవమని అడుగుతాడు. ప్రియమణి మాత్రం ఆలోచనలో పడుతుంది. మళ్ళీ దీప కుటుంబాన్ని ఏం చేస్తుందో ఈ మోనితమ్మ అని అనుకుంటుంది.

ఇంట్లో దీప కుటుంబం అంతా ఓ దగ్గర కూర్చొని సంతోషంగా కబుర్లు పెట్టుకుంటారు. అందులో సౌందర్య మాత్రం కనిపించదు. ఇక దీప పిల్లలకు పొడుపు కథలు వేస్తూ సరదాగా కనిపిస్తుంది. మొత్తానికి కార్తీక్ కుటుంబంలో మళ్లీ సంతోషం కనిపిస్తుంది. ఓవైపు మోనిత ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు కానీ బారసాల వేడుకలో దీప.. మోనితకు అందరి ముందు ఇచ్చిన జలక్ మాత్రం.. మోనితకు పట్టపగలే చుక్కలు చూపించిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now