Vodafone Idea : వొడాఫోన్ ఐడియా యూజ‌ర్ల‌కు భారీ షాక్‌.. చార్జిల పెంపు..

November 24, 2021 10:03 AM

Vodafone Idea : వొడాఫోన్ ఐడియా (వీఐ) త‌న వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. ప్రీపెయిడ్ చార్జిల‌ను పెంచుతున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు వీఐ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. అందులో బేస్ ప్లాన్ ధ‌ర రూ.99గా ఉంది. మిగిలిన అన్ని ప్లాన్ల‌పై 25 శాతం చార్జిల‌ను పెంచింది. అయితే బేస్ ప్లాన్‌లో ఎస్ఎంఎస్‌ల‌ను పంపుకునే వీలు లేదు. క‌నీసం నెల‌కు రూ.179 చెల్లిస్తే గానీ ఎస్ఎంఎస్‌లు పంపుకునే వీలు ఇక‌పై లేదు.

Vodafone Idea shock to users hiked prepaid tariffs

ఇక పెంచిన చార్జిల ప్ర‌కారం వీఐ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రూ.79, రూ.149, రూ.219, రూ.249, రూ.299, రూ.399, రూ.449, రూ.379, రూ.599, రూ.699, రూ.1499, రూ.2399 ల‌కు కొత్త ప్లాన్‌లు ల‌భిస్తున్నాయి. వీటి గురించిన పూర్తి వివ‌రాల‌ను కింద ఇచ్చిన చిత్రంలో చూసి తెలుసుకోవ‌చ్చు.

ఇక రూ.48, రూ.98, రూ.251, రూ.351ల‌కు డేటా టాప‌ప్స్‌ను వొడాఫోన్ ఐడియా అందిస్తోంది. పెంచిన చార్జిలు న‌వంబ‌ర్ 25 నుంచి అమ‌లులోకి రానున్నాయి. ఇప్ప‌టికే ఎయిర్ టెల్ చార్జిల‌ను పెంచ‌గా, అదే బాట‌లో వీఐ కూడా చార్జిల‌ను పెంచింది. అయితే రిల‌య‌న్స్ జియో ఇంకా ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now