Pushpa Movie : పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ వెనుకడుగు.. నిరాశలో అభిమానులు ?

November 23, 2021 8:28 PM

Pushpa Movie : ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఓ అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది.

Pushpa Movie  allu arjun back step fans are not happy

ఈ సినిమా కథ నిడివి ఎక్కువగా ఉండటంతో రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ బన్నీ తన అభిమానులను ఓ విషయంలో నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. ఇంతకీ అదేంటంటే.. పలు భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమాకు తాను డబ్బింగ్ చెప్పుకోవడానికి అల్లు అర్జున్ ఇష్టపడటం లేదట. తెలుగు తప్ప మిగతా భాషలలో డబ్బింగ్ చెప్పలేనంటూ.. అందుకు అక్కడి భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్టులతో డైలాగులు చెప్పించాల్సిందిగా కోరాడట. ఇక అల్లు అర్జున్ కు చెందిన ఈ విషయం తెలుస్తుండడంతో తెలుగు అభిమానులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అన్ని భాషలకు తాను డబ్బింగ్‌ చెప్పడం కష్టంగా ఉందట. అందుకనే తెలుగు తప్ప మిగిలిన అన్ని భాషలకు.. అక్కడి ఆర్టిస్టులతో అల్లు అర్జున్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తే. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా పుష్ప మూవీ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now