Ram Gopal Varma : రాంగోపాల్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసిన జె.డి.చక్రవర్తి..!

November 23, 2021 7:42 PM

Ram Gopal Varma : టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన దర్శకత్వంలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాంటి వాటిలో శివ సినిమా ఒకటి అని చెప్పవచ్చు. నాగార్జున, రఘువరుణ్, అమల, జె.డి.చక్రవర్తి లు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

jd chakravarthy interesting comments Ram Gopal Varma

తాజాగా ఈ సినిమా గురించి, దర్శకుడు వర్మ గురించి నటుడు జె.డి.చక్రవర్తి షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ సినిమాను 1990 డిసెంబర్ 7వ తేదీ విడుదల చేశాం. ఈ సినిమా విడుదల సమయంలో ఆ రోజు హైదరాబాద్ లోని దేవి థియేటర్ దగ్గర ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నాం. కానీ ఆ సమయంలో వర్మ మాత్రం ఆ దరిదాపుల్లో కనిపించలేదు. కానీ ఆయన ఎక్కడికి వెళ్లారో నాకు మాత్రమే తెలుసని జె.డి.చక్రవర్తి తెలిపారు.

శివ సినిమా విడుదల సమయంలో వర్మ గర్ల్ ఫ్రెండ్ విదేశాలకు వెళుతుండటంతో ఈయన ఆమెతో కలిసి ఉదయమే ఫ్లైట్ లో మద్రాస్ కు వెళ్లి ఆ రోజంతా ఆమెతో గడిపి వచ్చారు. ఆ రోజు రాత్రికి రావడంతో ఏంటి సార్ ఇదని అడగడంతో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, ఇక్కడ ఉండి నేనేం చేయాలి, మద్రాసుకు వెళ్లి ఆమెతో ఏం చేయాలో అదే చేశానని.. వర్మ చెప్పినట్లు, ఈ సందర్భంగా జె.డి.చక్రవర్తి వర్మ గురించి.. షాకింగ్ కామెంట్స్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now