Rana Miheeka : రానా – మిహికా పెళ్లికి సంబంధించిన అన్‌సీన్ వీడియో.. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్..

November 22, 2021 2:01 PM

Rana Miheeka : దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో రానా భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించి ఏ ఫొటో, వీడియో అయినా బ‌య‌ట‌కు వ‌స్తే అది కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్‌గా మారుతుంటుంది. తాజ‌గా మిహికా త‌మ పెళ్లి వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేయ‌గా, అది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అలాగే ఈ వీడియోని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

Rana Miheeka marriage unseen video trending in social media
Rana Miheeka marriage unseen video trending in social media

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న రానా గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో రామానాయుడు స్టూడియోలోనే కుటుంబీకుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కోవిడ్‌ నిబంధనల కారణంగా కేవలం సుమారు 30 మంది బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. వీరి పెళ్లికి ఉపయోగించిన వర్చువల్ వెడ్డింగ్ కార్డ్ అందరినీ ఆక‌ట్టుకుంది.

https://www.instagram.com/p/CWhvBL3jJd3/?utm_source=ig_embed&ig_rid=e339f26c-0827-4010-ade6-0b7618cdd609

 రానాతో ఏడడుగులు నడిచి ఇటీవలే ఏడాది పూర్తయిన సందర్భంగా భర్తపై ప్రేమను కురిపిస్తూ తమ బంధం ఎంతో అద్భుతం అని పేర్కొన్నారు మిహికా. ”నా లవ్‌కి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది ఎంతో ఆనందంగా గడిచింది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మంచి మనసున్న మనిషిగా నా జీవితంలో నాకు తోడుగా ఉంటున్నావు. థ్యాంక్యూ మై లైఫ్‌.. మై లవ్‌” అంటూ మిహికా తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now