Most Eligible Bachelor : ఓటీటీలోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సూప‌ర్ డూప‌ర్ హిట్‌..!

November 21, 2021 7:20 PM

Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ ఎంత హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీలో అఖిల్, పూజా హెగ్డెల కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింది. దీంతో అఖిల్‌కు తొలి హిట్ ద‌క్కిన‌ట్ల‌యింది. ఇక ఈ మూవీ స‌క్సెస్‌తో అఖిల్ మంచి జోష్ మీద ఉన్నాడు.

Most Eligible Bachelor super duper hit on aha ott

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీని ఇటీవ‌లే ఆహా ప్లాట్‌ఫాంలో లాంచ్ చేశారు. శుక్ర‌వారం నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఓటీటీలో కూడా ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది. ప‌లు కొత్త రికార్డుల‌ను న‌మోదు చేసింది.

ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభ‌మైన తొలి రెండు రోజుల్లోనే 10 కోట్ల నిమిషాల వ్యూస్ వ‌చ్చాయ‌ని ఆహా వెల్ల‌డించింది. ఈమేర‌కు జీఏ2 పిక్చ‌ర్స్ ట్వీట్ చేసింది. ఆహా యూజ‌ర్లు భారీ స్థాయిలో ఈ మూవీని వీక్షించి రికార్డును క్రియేట్ చేశారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాంపై కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు.

కాగా అఖిల్ ప్ర‌స్తుతం ఏజెంట్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌న‌కు ఇటీవలే క‌రోనా రావ‌డంతో మూవీ షూటింగ్‌కు కొంత‌కాలం బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment