భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా?

January 3, 2022 8:16 AM

ప్రస్తుతకాలంలో భోజనం చేసేటప్పుడు చాలామంది టీవీలకు అతుక్కుపోవడం, సెల్ ఫోన్ లో లీనమైపోతూ భోజనం చేస్తున్నారు. ఈ విధంగా భోజనాన్ని తినటం వల్ల అన్నపూర్ణా దేవి ఆగ్రహానికి బలి కావాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అందుకే భోజనం తినేటప్పుడు ఎంతో నిగ్రహంతో భోజనం చేయాలి.

భోజనం చేసే ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడిగి తూర్పు లేదా ఉత్తర దిశ వైపు కూర్చొని భోజనం చేయాలి. అదేవిధంగా భోజనం తినేటప్పుడు ఎలాంటి పరిస్థితులలో కూడా మధ్యలో లేవకూడదు. అలాగే కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎంగిలి చేతితో వడ్డించుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు.

ప్రస్తుతం జరిగే శుభకార్యాలలో భోజనాలు నిలబడి తినడం మనం చూస్తుంటాము. ఈ విధంగా తినటం వల్ల క్రమంగా దరిద్రులు అవుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొందరు కంచం ఒడిలో పెట్టుకొని తింటారు. ఈ విధంగా ఎప్పుడూ భోజనం చేయకూడదు. మరికొందరు తినే ఆహార పదార్థాలు రుచిగా లేవని వాటిని పడేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్నం పడేయటం వల్ల తీరని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now