ఏపీ అసెంబ్లీ ఘటనపై భావోద్వేగమైన కానిస్టేబుల్.. ఉద్యోగానికి రాజీనామా చేస్తూ..!

November 21, 2021 11:37 AM

శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి పై అసభ్యకర పదజాలంతో అవమానించి మాట్లాడారంటూ చంద్రబాబు మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు.

andhra pradesh police constable resigned to job on assembly incident

ఇక ఈ ఘటనపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ.. వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా తను పేరు విజయ్ కృష్ణ అని, 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ టాపర్ అని, చంద్రబాబు నాయుడు హయాంలో తనకు ఉద్యోగం వచ్చిందని, ఇప్పటివరకు విలువలతో కూడిన ఉద్యోగం చేస్తూ ఎవరి దగ్గరా చేయిచాచకుండా బతికానని  తెలిపారు.

తన జీవితంలో అవినీతికి తావు లేకుండా ఉద్యోగం చేశానని మొదటిసారిగా పోలీస్ వ్యవస్థలో మోకరిల్లి, పోస్టింగుల కోసం నీచమైన అవమానాలతో ఎంతో దిగజారి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఉద్యోగం తనకు వద్దంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి హోటల్, టీ కొట్టు పెట్టుకొని బ్రతుకుతానని ఈయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now