నెల రోజులుగా ఐసీయూలో కోవిడ్ పేషెంట్లకు చికిత్స.. ఒత్తిడి భరించలేక డాక్టర్‌ ఆత్మహత్య..

May 2, 2021 12:02 AM

కరోనా వల్ల ఓ వైపు ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే కోవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారు. రోజూ కొన్ని గంటల పాటు పీపీఈ కిట్‌లను ధరించి బాధను దిగమింగుతూ చికిత్స చేస్తున్నారు. మరోవైపు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా మరో డాక్టర్‌ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

doctor died of suicide for pressure for treating covid patients from one month in icu

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ వివేక్‌ రాజ్‌ (36) ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో గత నెల రోజుల నుంచి ఐసీయూలో ఉంటూ రోగులకు చికిత్స అందిస్తున్నాడు. రోజూ ఎంతో మంది కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడమే అతని పని. అతని వల్ల ఎంతో మంది కోవిడ్‌ నుంచి బయట పడ్డారు. ఇక రోజూ అతను ప్రాణాపాయ స్థితిలో ఉండే కోవిడ్‌ రోగులకు కూడా చికిత్సను అందిస్తున్నాడు.

అయితే తాజాగా అతను ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల రోజులుగా ఐసీయూలో ఉంటూ చికిత్సను అందిస్తున్నానని, ఒత్తిడిని భరించలేకపోతున్నానని అతను తన సూసైడ్‌ నోట్‌లో తెలిపాడు. దీంతో అతని మృతి పట్ల తోటి డాక్టర్లు, వైద్య సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. అతనికి గత నవంబర్‌ నెలలో వివాహం జరగ్గా అతని భార్య గర్భవతి. దీంతో అతని ఆత్మహత్య అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now