Kaikala Satyanarayana : విష‌మంగా కైకాల ఆరోగ్యం.. ఆందోళ‌న‌లో అభిమానులు..

November 20, 2021 12:07 PM

Kaikala Satyanarayana : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారుగా 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరో గా నటించిన కైకాల సత్యనారాయణ కాలక్రమంలో నేటి తరానికి తండ్రి, తాత పాత్రల్లో కూడా నటించారు.

Kaikala Satyanarayana health is not good condition is serious

ఇటీవ‌ల కైకాల త‌న ఇంట్లో ప్రమాదవశాత్తూ జారి పడ్డారు. కుటుంబసభ్యులు వెంట‌నే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడు ఆయ‌న‌ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కుటుంబసభ్యులు తెలిపారు. కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది.

సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు ప్రార్ధిస్తున్నారు. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారు. 1960లో సత్యనారాయణ నాగేశ్వరమ్మని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now