Bigg Boss 5 : బ‌య‌ట‌కొచ్చిన జెస్సీ హెల్తీగా ఉన్నాడు.. లోప‌ల ఉన్న‌ప్పుడు ఏమైంది ?

November 20, 2021 12:02 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా ఉన్న జ‌స్వంత్ అనారోగ్యం వ‌ల‌న ప‌దో వారం బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అతను అనారోగ్యంతో హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళుతున్నాడ‌ని తెలిసి హౌజ్‌మేట్సే కాకుండా అభిమానులు కూడా చాలా భావోద్వేగానికి గుర‌య్యారు. ‘వర్టిగో’ వ్యాధి వల్ల హౌజ్‌లో ఉన్న‌ప్పుడు జెస్సీ గట్టిగా మాట్లాడలేకపోయాడు, తినలేకపోయాడు.. సరిగా నడవలేకపోయాడు.. మెడ పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.

Bigg Boss 5  jessie is very healthy outside what happened to him inside

హౌజ్‌లో ఉన్న‌ప్పుడు చాలా బాధ‌ప‌డ్డ జెస్సీ బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం నానా హంగామా చేశాడు. మిడ్ నైట్ పార్టీలంటూ రచ్చ చేశాడు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి పార్టీలు చేసుకున్నాడు. ఇక ఫ్యాన్స్ మీట్లు, ఊరేగింపులతో జెస్సీ దుమ్ములేపేశాడు. బ‌య‌ట ఇంత ఉత్సాహంగా క‌నిపించిన జ‌స్వంత్ లోప‌ల మాత్రం అంత ఇబ్బందిగా ఎందుకు ఫీల‌య్యాడు.. అనేది ఎవ‌రికీ అర్ధం కాలేదు. అయితే తాజాగా వాటి వెనకాల ఉన్న కారణం బయటకు వచ్చింది.

విజయవాడలో జ‌స్వంత్ ఓ వ్యాధి కోసం చికిత్స తీసుకున్నాడట. ఇది బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురవ్వడం, ఆటలు ఆడటం వల్ల ఎక్కువైంది.. బయటకు వచ్చాక ఆ ఒత్తిడి తగ్గిపోయింది. చికిత్స కూడా తీసుకున్న క్ర‌మంలో జ‌స్వంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

జెస్సీ కూడా త‌న ఆరోగ్యం బాగుంద‌ని చెప్పేశాడు. మొత్తానికి జెస్సీకి విజయవాడలో భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాన్ మీట్లు పెట్టేశారు. జెస్సీ క్రేజ్ ఏంటో సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now