RGV : చంద్ర‌బాబు నాయుడు ఏడ్చింది అందుకేన‌ట‌.. ఆర్‌జీవీ చెప్పేశారు..!

November 20, 2021 2:32 PM

RGV : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాలలో భాగంగా సభ నుంచి వాకౌట్ అవుతూ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు సభలో తమను ఎంతో అవమానించారని తనని మాత్రమే కాకుండా తన భార్యను కూడా అవమానించారని వెల్లడించారు.

RGV told why chandrababu naidu cried

40 సంవత్సరాల అనుభవం ఉన్న తనకు ఈ విధమైన అవమానం ఎదురవడంతో సభ నుంచి వాకౌట్ చేస్తూ.. తిరిగి సీఎం అయిన తరువాతనే సభలోకి అడుగుపెడతానని.. చంద్రబాబు శపథం చేసి వెళ్ళారు. సభ నుంచి వాకౌట్ అయిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. భోరున విలపించారు. ఇలా చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్వడంపై కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. తన దైన శైలిలో సెటైర్లు వేశారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తాను రూపొందించిన పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్ అనే ట్రైలర్ చూసే.. చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు.. అంటూ కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏడుస్తున్న క్లిప్ కట్ చేసి.. ఆయనే మాట్లాడుతున్నట్టుగా ఒక మిమిక్రీ వాయిస్ క్రియేట్ చేసి.. ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది.. దీన్ని ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకైతే అర్థం కావ‌డం లేదు’ అంటూ.. చంద్రబాబు నాయుడు ఏడుస్తున్న వీడియోను షేర్ చేశారు.

అదేవిధంగా ఇందాకే బాబు ఈ ట్రైలర్ చూశారు.. ఆయన స్పందించిన తీరుకి ధన్యవాదాలు.. అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు ఆర్‌జీవీ వాడకం మామూలుగా లేదుగా అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now