Unstoppable With NBK : బాల‌య్య షోలో ర‌చ్చ చేసేందుకు సిద్ధ‌మైన రోజా.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

November 20, 2021 9:34 AM

Unstoppable With NBK : బాల‌కృష్ణ‌ – రోజా.. ఈ కాంబినేష‌న్ వింటే అభిమానులకు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. బాలయ్య, రోజా వెండితెరపై సూపర్ హిట్ జోడీ. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాక బాలయ్యతో రోజా పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి చిత్రాల్లో కూడా రొమాన్స్ చేసింది.

Unstoppable With NBK roja may come to balakrishna show

వీరిద్ద‌రూ ఇప్పుడు సినిమాల‌లో న‌టించ‌క‌పోయినా కూడా అప్పుడప్పుడూ త‌మ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్ మెంట్‌ అందిస్తుంటారు. ఈ మధ్య రోజా పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ స్వయంగా రోజాకు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలియజేశారట.

అంతేకాదు తాను ‘ఆహా’లో హోస్ట్ చేస్తోన్న ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా రావాలని అడిగారట. ఇక రోజా కూడా బాలయ్య పిలుపుకు ఓకే చెప్పి త్వరలో ఈ షోకు రావడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. బాలయ్య హోస్ట్ చేసిన రెండు ప్రోగ్రామ్‌లను చూసిన రోజా.. ఆయన టాలెంట్‌ను మెచ్చుకున్నట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య షోకు రోజా వస్తే నిజంగానే ఆహా అనాల్సిందే. ఇదిలా ఉండగా రోజా .. జ‌బ‌ర్ధ‌స్త్ వేదిక‌పై నుండి బాల‌య్య‌కు ఫోన్ చేసిన విష‌యం తెలిసిందే. ఫోన్ సంభాషణలో బాలయ్య జబర్ధస్త్ షోకు రానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే కదా.

బాల‌య్య షోలో ఇప్ప‌టికే మోహన్ బాబు, నాని తెగ సంద‌డి చేయ‌గా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా వ‌స్తాడని అంటున్నారు. రౌడీ హీరోతో బాల‌కృష్ణ సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాల‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. విజ‌య్ ప్ర‌స్తుతం లైగ‌ర్ కోసం యూఎస్ లో ఉండ‌గా, షూటింగ్ పూర్త‌య్యాక బాల‌య్య షోలోలో పాల్గొంటాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇక రోజాతో బాలయ్య షో ఎపిసోడ్‌ ఎప్పుడు టెలికాస్ట్‌ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now