Samantha Naga Chaithanya : విడాకుల తరువాత బిజీ బిజీ.. సమంత, నాగచైతన్య.. చేతి నిండా ప్రాజెక్టులే..!

November 19, 2021 9:57 PM

Samantha Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య విడాకులు ప్రకటించిన తర్వాత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వరుస సినిమా కథలను వింటూ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక కథల ఎంపిక విషయంలోనూ నాగచైతన్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Samantha Naga Chaithanya busy busy with their handful of projects

ఇదిలా ఉండగా నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. అలాగే సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ చిత్రంగా తెరకెక్కుతున్న బంగార్రాజులో నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు.

ఇక థాంక్యూ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడట. కాగా ఈ చిత్రాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో నాగచైతన్య బిజీగా ఉన్నాడు.

మరోవైపు సమంత కూడా విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. ఆమె నటించిన శాకుంతలం, కాతువాకుల రెండ కాదల్‌ అనే మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆహా నిర్మించే ఓ వెబ్‌ సిరీస్‌లో సమంత నటిస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఓ బాలీవుడ్‌ మూవీకి సమంత  ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక త్వరలోనే పుష్ప మూవీలో ఓ ఐటమ్‌ సాంగ్‌ను చేయనుంది. ఇలా ఈ వీరిద్దరూ విడాకుల ప్రకటన అనంతరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now