RRR Movie : ఆర్ఆర్ఆర్‌పై సెటైర్ వేసిన నెటిజ‌న్.. పాజిటివ్‌గా స్పందించిన చిత్ర బృందం..

November 19, 2021 8:30 PM

RRR Movie : ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ అనే పీరియాడిక‌ల్ మూవీని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమై నేటికి (నవంబర్‌ 19) మూడేళ్లు అవుతోంది. సరిగ్గా (18-11-2018) రోజున రాజమౌళి, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఫొటోను షేర్‌ చేస్తూ షూటింగ్‌ మొదలైనట్లు డీవీవీ సంస్థ ప్రకటించింది.

RRR Movie  team responded positively over a netizen question

పాత పోస్ట్‌ని ఓ నెటిజ‌న్ రీ ట్వీట్ చేస్తూ.. ‘డిప్లొమాలో ఉన్నప్పుడు మీరు సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. నా బీటెక్‌ కూడా అయిపోతోంది. మూవీ మాత్రం ఇంకా రిలీజ్‌ కాలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీం స్పందిస్తూ అతడికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. ‘ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్‌ చేయలేదు’ అంటూ కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యమైనట్లు చెప్పకనే చెప్పింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాని భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి చూపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now