Most Eligible Bachelor : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.. వెంట‌నే చూసేయండి..!

November 19, 2021 2:25 PM

Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. ఈ మూవీ అక్టోబ‌ర్ 15వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ శుక్ర‌వారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.

Most Eligible Bachelor streaming on aha ott platform

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించ‌గా.. ఎన్నో ఆటుపోట్ల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని విడుద‌ల చేశారు. అఖిల్‌కు కెరీర్‌లో ఇప్ప‌టి వ‌రకు చెప్పుకునేందుకు హిట్లు లేవు. ఆ ఆక‌లిని ఈ మూవీ తీర్చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎట్టకేల‌కు అఖిల్ ఖాతాలో ఓ హిట్ మూవీ వ‌చ్చి చేరింది. ఇక ఈ మూవీని ప్ర‌స్తుతం ఆహాలో వీక్షించ‌వ‌చ్చు.

ఈ మూవీ విడుద‌లై నెల రోజులు దాటిన నేప‌థ్యంలో దీన్ని ఓటీటీలో విడుద‌ల చేశారు. థియేట‌ర్ల‌కు వెళ్లిన వారు ఈ మూవీని ఇంట్లోనే ఆహా ఓటీటీలో చూడ‌వ‌చ్చు. కాగా ఓ ఎన్ఆర్ఐ ఇండియాకు వ‌చ్చి పెళ్లి చేసుకోవాల‌ని చూస్తుంటాడు. అంత‌లోనే ల‌వ్‌లో ప‌డ‌తాడు. అద్భుత‌మైన కామెడీతో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ క్ర‌మంలోనే అఖిల్‌, పూజా హెగ్డెల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వ‌ర్క‌వుట్ అయింది.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీకి చెందిన పాట‌లు కూడా ప్రేక్ష‌కుల‌కు బాగానే ఎక్కాయి. ఈ మూవీని ఆహాలో విడుద‌ల చేస్తున్న‌ట్లు కొన్ని రోజుల కింద‌టే ప్ర‌క‌టించారు. చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

ఇక అఖిల్ ప్ర‌స్తుతం ఏజెంట్ అనే మూవీతో బిజీగా ఉండ‌గా.. పూజా హెగ్డె ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తూ అద్భుత‌మైన ఫొటోల‌ను షేర్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now