RGV Missing : ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్.. ప‌వ‌న్, చిరు, చంద్ర‌బాబుల‌ని.. భ‌లే టార్గెట్ చేశాడుగా..!

November 19, 2021 1:27 PM

RGV Missing : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సెన్సేష‌న్స్ క్రియేట్ చేసేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. తాజ‌గా ఆయ‌న ఆర్జీవీ మిస్సింగ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. అప్పుడెప్పుడో ఈ సినిమాని తెర‌పైకి తీసుకురాగా, మ‌ధ్య‌లో కొన్నాళ్లు పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు ట్రైలర్ విడుద‌ల చేసి తిరిగి వార్త‌ల‌లోకి ఎక్కారు. వర్మను మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతడి కొడుకు కిడ్నాప్‌ చేశారనే కోణంలో ఈ సినిమాను తీసినట్లు.. ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

RGV Missing by ram gopal varma movie traler launched

వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో పలువురు టాలీవుడ్‌ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. వర్మ క్రియేట్ చేసిన ‘ఆర్జీవీ మిస్సింగ్’ చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=h8Dae9ovgfk

ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అ​యితే పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది.

ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తారు. వారి విచారణలో షాకింగ్ విషయాలను తెలుసుకుంటారు. ఈ విధంగా కథ సాగుతుంది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వర్మ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now