Kangana Ranaut : కంగనా వ్యాఖ్యలపై భారీగా వెల్లువెత్తుతున్న నిరసనలు.. దేశ ద్రోహం కేసు నమోదు..

November 18, 2021 2:43 PM

Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఏం చేసినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంటుంది. అందుకు గల కారణం ఈమె చేసే ట్వీట్స్ అని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం కంగనారనౌత్ భారత స్వాతంత్రోద్యమం, మహాత్మా గాంధీ పై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఈమె వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వాతంత్ర ఉద్యమం గురించి కంగనా మాట్లాడిన వ్యాఖ్యలపై జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఏకంగా ఈమెపై దేశ ద్రోహ కేసులు నమోదు చేశారు.

citizen angry on Kangana Ranaut  for her comments on mahatma gandhi

గత కొన్ని రోజుల క్రితం ఈమె భారత స్వాతంత్రోద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకొని ఎన్నో విమర్శలు చేశారు. ఒక చెంప చూపిస్తే స్వార్థం కాదు కేవలం భిక్ష మాత్రమే వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ తన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.

ఆమె కేవలం తన వ్యాఖ్యలతోనే దేశ పరువుకు నష్టం కలిగిస్తుందని.. ఈ క్రమంలోనే ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కాగా కంగనా పై జార్ఖండ్‌లోని పండర్‌పాలా నివాసి ఇజార్‌ అహ్మద్‌ ధన్‌బాద్‌ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రానుంది. అదేవిధంగా బీహార్‌లో కూడా ఈమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. అది ఈ నెల 22వ తేదీన విచారణకు రానుంది.

ఇలా భారత స్వాతంత్రం గురించి, స్వాతంత్ర యోధుల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఈమెపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now