Microsoft Surface Go 3 : 10.5 ఇంచుల డిస్‌ప్లేతో వ‌చ్చిన మైక్రోసాఫ్ట్ కొత్త స‌ర్ఫేస్ ట్యాబ్‌..!

November 17, 2021 6:28 PM

Microsoft Surface Go 3 : ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్.. స‌ర్ఫేస్ సిరీస్‌లో ఓ నూత‌న ట్యాబ్‌ను తాజాగా లాంచ్ చేసింది. స‌ర్ఫేస్ గో 3 పేరిట ఆ ట్యాబ్ విడుద‌లైంది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో 10.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్ కూడా ఉంది.

Microsoft Surface Go 3 new surface tablet launched in india

ఈ ట్యాబ్‌లో డ్యుయ‌ల్ కోర్ ఇంటెల్ పెంటియ‌మ్ గోల్డ్ 6500వై ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ కోర్ 10వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ఐ3-10100వై ప్రాసెస‌ర్‌తో ఇంకో వేరియెంట్‌ను కూడా అందిస్తున్నారు. ఇంటెల్ అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్ ల‌భిస్తాయి. 4/8 జీబీ ర్యామ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ట్యాబ్‌ను అందిస్తున్నారు.

ఈ ట్యాబ్‌ను 2-ఇన్‌-1 గా ఉప‌యోగించుకోవ‌చ్చు. అంటే కీబోర్డును ఫిక్స్ చేసి పీసీలా వాడుకోవ‌చ్చు. లేదా ట్యాబ్‌లాగే ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందులో 64జీబీ ఈఎంఎంసీ డ్రైవ్ ల‌భిస్తుంది. 128 జీబీ ఎస్ఎస్‌డీ డ్రైవ్‌ను అందిస్తున్నారు. వైఫై ఆప్ష‌న్ ఉంది. 11 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది.

ఈ ట్యాబ్‌లో ఫేస్ ఆథెంటికేష‌న్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే ముందు వైపు 5 మెగాపిక్స‌ల్‌, వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. డాల్బీ ఆడియో, వైఫై 6, బ్లూటూత్ 5.0.. ఫీచ‌ర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ స‌ర్ఫేస్ గో 3 ప్రారంభ ధ‌ర రూ.42,999 ఉండ‌గా.. ప‌లు వేరియెంట్లు ఇందులో ల‌భిస్తున్నాయి. గ‌రిష్ట వేరియెంట్ ధ‌ర రూ.62,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను న‌వంబ‌ర్ 23 లోగా ప్రీ ఆర్డ‌ర్ చేస్తే రూ.9,099 విలువైన స‌ర్ఫేస్ పెన్‌ను ఉచితంగా అందిస్తారు. డిసెంబ‌ర్ నెల నుంచి ఆథ‌రైజ్డ్ డీల‌ర్స్ వ‌ద్ద ఈ ట్యాబ్ ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now