Naga Chaithanya : నాగ‌చైత‌న్య‌కు మ‌ళ్లీ నిరాశే.. కొంత కాలం ఆగాల్సిందే..?

November 16, 2021 10:38 PM

Naga Chaithanya : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకున్న త‌రువాత‌.. స‌మంత జోరుగా సినిమాల్లో న‌టిస్తోంది. అనేక ప్ర‌దేశాలకు టూర్లు వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో సందేశాలు పెడుతోంది. అయితే చైతూ మాత్రం అన్నింటికీ దూరంగా ఉంటున్నాడు. ల‌వ్ స్టోరీ మూవీ స‌క్సెస్ అయ్యాక‌.. చైతూ చూద్దామ‌న్నా బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. త‌న సోద‌రుడు అఖిల్ మోస్ట్ బ్యాచిల‌ర్ మూవీ వేడుక‌కు హాజ‌ర‌య్యాడు.

Naga Chaithanya has to wait for some time for his hindi movie

అయితే నాగ‌చైత‌న్య.. అమీర్‌ఖాన్‌తో క‌లిసి న‌టించిన లాగ్ సింగ్ చ‌డ్డా మూవీ విడుద‌ల మ‌రింత ఆల‌స్యం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 2022లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఆ స‌మ‌యంలో బాలీవుడ్‌లో ప‌లు మూవీలు విడుద‌లకు ఉన్నాయి. అలాగే వాలెంటైన్స్ డే ఉంటుంది క‌నుక ఆ స‌మ‌యంలో సినిమా విడుద‌ల స‌రికాద‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

లాల్ సింగ్ చ‌డ్డా మూవీని వేస‌విలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి గాను అమీర్‌ఖాన్ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్‌ను కూడా ప్రారంభించారు. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ అనే చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ మూవీలో క‌రీనా క‌పూర్ ఖాన్ ఫీమేల్ లీడ్‌లో న‌టిస్తోంది. ఇక ఇందులో నాగ‌చైత‌న్య గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇది చైతూకు డెబ్యూ మూవీ కాగా.. ఈ మూవీ విడుద‌ల‌పై చైతూ ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే సినిమా విడుద‌ల ఆల‌స్యం అవుతుండ‌డంతో చైతూ నిరాశ‌కు గురవ‌క త‌ప్ప‌డం లేదు. మూవీ విడుద‌ల‌కు ఇంకొంత కాలం ఆగాల్సి వ‌స్తోంది.

ఇందులో చైతూ, అమీర్‌ఖాన్ ఆర్మీ అధికారులుగా న‌టిస్తున్నారు. బాల పాత్ర‌లో ఆంధ్రా యంగ్‌స్ట‌ర్‌గా చైతూ ఈ మూవీలో క‌నిపించ‌నున్నాడు. ఇక ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన అమీర్‌ఖాన్ చైతూ ల‌వ్ స్టోరీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నాడు. ఆ స‌మ‌యానికి విడాకుల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఇద్ద‌రూ విడిపోయార‌ని అప్ప‌టికే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. త‌రువాత అవే నిజం అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now